IPL 2020, SRH vs KKR.. ఓపెనర్ల ఔట్.. ఓత్తిడిలో హైదరాబాద్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న హైదరాబాద్‌‌కు ఆరంభంలోనే పెద్దదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(5) జట్టు స్కోరు 24 వద్ద వెనుదిరిగాడు. పాట్‌ కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌ స్టో బౌల్డ్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(36/30) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికే […]

IPL 2020, SRH vs KKR.. ఓపెనర్ల ఔట్.. ఓత్తిడిలో హైదరాబాద్‌
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2020 | 8:44 PM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న హైదరాబాద్‌‌కు ఆరంభంలోనే పెద్దదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(5) జట్టు స్కోరు 24 వద్ద వెనుదిరిగాడు. పాట్‌ కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌ స్టో బౌల్డ్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(36/30) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ .. రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఫామ్‌లో లేకపోవడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే(18), వృద్ధిమాన్‌ సాహా(1) క్రీజులో ఉన్నారు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్‌మన్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయకుండా అడ్డుకుంటున్నారు.