జగన్‌కు హై సెక్యూరిటీ? కారణాలేంటి?

అదేంటో గాని కొత్తగా.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో పొలిటికల్ వార్ మరింత ముదిరింది. ఇప్పటికే చంద్రబాబు కేంద్రంపై, ఈసీపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధికారుల బదీలీలు సహా పలు అంశాల్లో వైసీపీకి మేలు జరిగేలా ఈసీ, కేంద్రం వ్యవహరించాయని టీడీపీ వాదన. కాగా మరో అంశంపై టీడీపీ ఆందోళలను ఉదృతం చేసే అవకాశం కనిపిస్తుంది.  తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం భద్రతను మరింత పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల […]

జగన్‌కు హై సెక్యూరిటీ? కారణాలేంటి?
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Apr 16, 2019 | 12:44 PM

అదేంటో గాని కొత్తగా.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో పొలిటికల్ వార్ మరింత ముదిరింది. ఇప్పటికే చంద్రబాబు కేంద్రంపై, ఈసీపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధికారుల బదీలీలు సహా పలు అంశాల్లో వైసీపీకి మేలు జరిగేలా ఈసీ, కేంద్రం వ్యవహరించాయని టీడీపీ వాదన. కాగా మరో అంశంపై టీడీపీ ఆందోళలను ఉదృతం చేసే అవకాశం కనిపిస్తుంది.  తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం భద్రతను మరింత పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రానికి కాబోయే సీఎం జగనే అని ఇంటలిజెన్స్ సర్వే రిపోర్ట్‌ను కేంద్ర హోంశాఖకు ఇచ్చినట్లు సమాచారం. దాంతో సెంట్రల్ హోమ్ అఫైర్స్ కమిటీ జగన్‌కు మరింత హై సెక్యూరిటీని అలాట్ చేసినట్లు సమాచారం.

పాదయాత్ర చేస్తున్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ పై హత్యాయత్నప్రయత్నం జరిగిని విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన ఏయిర్ పోర్ట్‌లాంజ్‌లోనే శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో జగన్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ఈ నేపధ్యంలో జగన్ కు సెక్యూరిటీని పెంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.