పరీక్షలు చేయించుకోని వారంతా క్వారంటైన్‌కే.. మార్గదర్శకాలను సవరించిన కేంద్రం..

ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోకుండా భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది.

పరీక్షలు చేయించుకోని వారంతా క్వారంటైన్‌కే.. మార్గదర్శకాలను సవరించిన కేంద్రం..
Follow us

|

Updated on: Nov 06, 2020 | 3:50 PM

ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోకుండా భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది. టెస్టులు చేయించుకోకున్నా.. ఎయిర్‌పోర్టుల్లో పరీక్షలు చేసే సౌకర్యం లేకపోయినా.. విదేశీ ప్రయాణీకులు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపింది. ఈ మేరకు ఆగష్టు 2 నాటి మార్గదర్శకాలను సవరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా కొత్తవాటిని జారీ చేసింది.

Also Read: ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!

ఇక అంతర్జాతీయ ప్రయాణీకులు బయల్దేరడానికి 72 గంటల ముందుగా www.newdelhiairport.in పోర్టల్‌ ద్వారా 14 రోజుల హోం క్వారంటైన్ నిబంధనలకు అంగీకారం తెలుపుతూ స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని సూచించింది. గర్భిణీలకు, కుటుంబసభ్యులు మరణించినవారికీ, తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు కారణంగా వచ్చినవారికి, పదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు మాత్రమే 14 రోజుల హోం క్వారంటైన్‌కు అనుమతి ఉందని ప్రకటించింది.

Also Read: జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..