కేరళలో కలకలం రేపిన బిన్‌లాడెన్ కారు

కేరళలో కలకలం రేపిన బిన్‌లాడెన్ కారు

శ్రీలంక పేలుళ్లకు.. అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌లాడెన్కు సంబంధం ఉందా..? శ్రీలంకను టార్గెట్ చేసింది అంతర్జాతీయ ఉగ్రవాదులేనా…? లంక సీరియల్ బ్లాస్టింగ్స్‌తో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అప్రమత్తం కావడానికి కారణం ఏమిటి..? కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచే ఉగ్రవాదులు లంకలోకి ప్రవేశించారా..? కేరళలో తాజాగా ఉగ్రవాది బిన్‌లాడెన్ పేరు, ఫోటో ఉన్న కారు రోడ్లపై కనిపించడం కలకలం రేపింది. కేరళలోని కొల్లాంలో ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ పేరు, ఫోటో ఉన్న కారు కనిపించింది. WB 6-8451 నంబరు గల […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2019 | 11:28 AM

శ్రీలంక పేలుళ్లకు.. అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌లాడెన్కు సంబంధం ఉందా..? శ్రీలంకను టార్గెట్ చేసింది అంతర్జాతీయ ఉగ్రవాదులేనా…? లంక సీరియల్ బ్లాస్టింగ్స్‌తో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అప్రమత్తం కావడానికి కారణం ఏమిటి..? కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచే ఉగ్రవాదులు లంకలోకి ప్రవేశించారా..? కేరళలో తాజాగా ఉగ్రవాది బిన్‌లాడెన్ పేరు, ఫోటో ఉన్న కారు రోడ్లపై కనిపించడం కలకలం రేపింది.

కేరళలోని కొల్లాంలో ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ పేరు, ఫోటో ఉన్న కారు కనిపించింది. WB 6-8451 నంబరు గల కారు వెనకాల బిన్ లాడెన్ స్టిక్కర్ అతికించి ఉంది. కారు నంబర్ ఆధారంగా అది వెస్ట్ బెంగాల్‌ కి చెందినదిగా గుర్తించారు. ఆ కారు వెనకాలే వెళ్లిన మరో కారులో ఉన్న వ్యక్తులు అనుమానంతో ఫోటో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించారు పోలీసులు.

అయితే కారు తాము ఓ వ్యక్తి దగ్గర అద్దె ప్రాతిపదికన తీసుకున్నామని.. పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు వెల్లడించారు. దీంతో కారు యజమానికి కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి దగ్గర ఏడాది క్రితం కారు కొన్నానని యజమాని తెలిపాడు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టారు పోలీసులు.

దీంతో కారు యజమాని, ప్రయాణికులను బెయిల్ పై విడుదల చేశారు. అవసరం అయినప్పుడు పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు వెస్ట్ బెంగాల్‌ చేరుకుని విచారణ చేపట్టారు.

శ్రీలంక వరుస పేలుళ్ల నేపథ్యంలో భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేంద్ర నిఘా విభాగాలు అప్రమత్తం చేశాయి. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రధానంగా తీర ప్రాంతంల్లో గస్తీని రెట్టింపు చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, కమెండోలు, బాంబు నిర్వీర్య బృందాలను అప్రమత్తం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu