Cancel IPL 2020: కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?

Cancel IPL 2020: ఐపీఎల్.. ఈ పొట్టి క్రికెట్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. బ్యాటింగ్ మెరుపులు, సిక్స్‌ల జోరు.. ఆటగాళ్ల విన్యాసాలతో ఈ లీగ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ టూ మస్తీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇక ఈ ఐపీఎల్ పుణ్యమా అని ఎంతోమంది ఇండియన్ ప్లేయర్లకు, విదేశీ ప్లేయర్లకు అంతర్జాతీయ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పాలి. ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో కూడా […]

Cancel IPL 2020: కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?
Follow us

|

Updated on: Mar 10, 2020 | 10:45 PM

Cancel IPL 2020: ఐపీఎల్.. ఈ పొట్టి క్రికెట్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. బ్యాటింగ్ మెరుపులు, సిక్స్‌ల జోరు.. ఆటగాళ్ల విన్యాసాలతో ఈ లీగ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ టూ మస్తీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇక ఈ ఐపీఎల్ పుణ్యమా అని ఎంతోమంది ఇండియన్ ప్లేయర్లకు, విదేశీ ప్లేయర్లకు అంతర్జాతీయ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పాలి.

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో కూడా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య 46కు చేరుకుంది. ఇలా కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ.. ఐపీఎల్ 13 జరుగుతుందా లేదా అన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లీగ్ ఖచ్చితంగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ప్రకటించాడు. అయితే ఈ మెగా లీగ్‌ను నిర్వహించేందుకు పలు ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తున్నాయి.

మొన్నటికి మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్‌ను వాయిదా వేయాలని కోరగా.. లేటెస్ట్‌గా కర్ణాటక ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లీగ్ నిర్వహించమని ప్రకటించింది. ఇంతటితో ఆగకుండా ఐపీఎల్‌ను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ కూడా రాసింది.

ఇదిలా ఉంటే కర్ణాటకలో తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికీ కరోనా పాజిటివ్ అని తేలింది. అతన్ని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్ లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అటు వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే అక్కడి ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

బెంగళూరులో కరోనా కేసు నమోదు కావడంతో ఐపీఎల్ రద్దు చేయాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు స్థానిక టీవీ ఛానెల్ తెలిపింది. దీనితో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లపై గందరగోళం నెలకొంది. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

For More News:

మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్

నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…

విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…

ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..

నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..

కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?

కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..