జైలుకు కన్నం వేసి పారిపోయిన ఖైదీలు..

జైలుకు కన్నం వేసి పారిపోవడం ఈ మధ్య ఖైదీలకు ఫ్యాషన్ అయిపోయింది. హాలివుడ్ సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారో..లేక తన క్రైమ్ బుర్రలకు పనిచెబుతున్నారో తెలియదు కానీ క్రిమినల్స్ జైలు నుంచి ఈజీగా చెక్కేస్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సాలినాస్ పట్టణంలోని ఓ జైలులో టాయిలెట్ పైకప్పుకు  రంధ్రం పెట్టి శాంటోస్ శామ్యూల్, జనాథన్ సలాజర్ అనే ఈ ఇద్దరు ఖైదీలు తప్పించుకు పారిపోయారు. వీరిద్దరూ వేర్వేరు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అచ్చం […]

జైలుకు కన్నం వేసి పారిపోయిన ఖైదీలు..
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Nov 08, 2019 | 1:01 PM

జైలుకు కన్నం వేసి పారిపోవడం ఈ మధ్య ఖైదీలకు ఫ్యాషన్ అయిపోయింది. హాలివుడ్ సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారో..లేక తన క్రైమ్ బుర్రలకు పనిచెబుతున్నారో తెలియదు కానీ క్రిమినల్స్ జైలు నుంచి ఈజీగా చెక్కేస్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సాలినాస్ పట్టణంలోని ఓ జైలులో టాయిలెట్ పైకప్పుకు  రంధ్రం పెట్టి శాంటోస్ శామ్యూల్, జనాథన్ సలాజర్ అనే ఈ ఇద్దరు ఖైదీలు తప్పించుకు పారిపోయారు. వీరిద్దరూ వేర్వేరు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

అచ్చం హాలివుడ్ సినిమా రేంజ్‌లో:

పక్కాగా రెక్కీ నిర్వహించిన కేటుగాళ్లు పోలీసు గార్డుల అబ్జర్వేషన్ లేని ఓ టాయిలెట్ సీలింగ్‌ సెలక్ట్ చేసుకుని.. దానికి 55 సెం.మీ.ల  రంధ్రం పెట్టారు. దానిలో నుంచి పైకి ఎక్కి, పైపులు ఉండే మెయింటెనెన్స్ ఏరియాలోకి ప్రవేశించారు. అందులో నుంచి పాక్కుంటూ వెళ్లగా…ఓ కిటికీ అడ్డుతగలడంతో దాన్ని బలవంతంగా తెరిచి ఎస్కేప్ అయ్యారు. కాగా వీళ్లు పాకుతూ ఉన్న పైపుల్లో కొన్ని చోట్ల 30 సెం.మీ వెడల్పు మాత్రమే ఉంది. అక్కడ కూడా ఎలా ముందుకువెళ్లారన్నది ఇప్పుడు పోలీసులకు మిస్టరీగా మారింది. కాగా తప్పించుకున్న ఖైదీలు ప్రమాదకరమైన వ్యక్తులు కావడంతో..పోలీసులు వారి కోసం విసృతంగా గాలిస్తున్నారు.  ఆచూకీ తెలిపిన వారికి రూ.3.5 లక్షల నగదు రివార్డు ఇస్తామని కూడా  ప్రకటించారు. కాగా పోలీసులు ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.