byju’s buy Akash: ఆకాష్ ఎడ్యుకేషన్‌ను కొనుగోలు చేయనున్న బైజూస్… దేశంలో అతిపెద్ద ఎడ్యుటెక్ డీల్స్‌లో ఇదీ ఒకటి..
byju's buy Akash: దేశీయంగా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణలో తనదైన ముద్ర వేసింది బెంగళూరుకు చెందిన బైజూస్ సంస్థ. దేశంలోని చాలా రాష్ట్రాలకు బైజూస్ తన సేవలను విస్తరించింది...
byju’s buy Akash: దేశీయంగా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణలో తనదైన ముద్ర వేసింది బెంగళూరుకు చెందిన బైజూస్ సంస్థ. దేశంలోని చాలా రాష్ట్రాలకు బైజూస్ తన సేవలను విస్తరించింది. వివిధ భాషల్లో బడా సినీ స్టార్లతో ప్రమోట్ చేస్తూ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగంలో నెం1గా దూసుకెళుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్.. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఏకంగా రూ.7300 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో దేశంలోనే అతిపెద్ద ఎడ్యుటెక్ డీల్స్‌లో ఒకటిగా ఇది నిలవనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులకు డిమాండ్ పెరుగుతుండడంతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైజూస్ ఇటీవల నిధుల సమీకరణలో పడింది. ఇందులో భాగంగానే జుకర్‌బర్గ్ సంస్థతో పాటు, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, బాండ్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంది. దీంతో బైజూస్ విలువ ఏకంగా 12 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇక ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మెడికల్ విద్యా శిక్షణ అందించే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 200 శిక్షణా కేంద్రాలున్నాయి.
Also Read: అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొత్త సర్కార్ కీలక ప్రకటన.. మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్న జో బైడెన్