స్టార్టప్‌ల పాలిట స్వర్గధామం, ఎక్కడ వెనుకబడ్డామో పరిశీలిస్తున్నాం.. ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ రాలేదు’
కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ స్టార్టప్‌ల పాలిట స్వర్గధామంగా మారిందని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో బెంగళూరు కంటే ఎక్కడ వెనుకబడ్డామో పరిశీలించుకుంటున్నామని ఆయన అన్నారు. మూడు ‘డి’లదే భవిష్యత్ అంతా.. అని చెప్పిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ హబ్‌గా మారుతోందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతామన్నారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్‌లోనే తయారైందని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. […]
కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ స్టార్టప్‌ల పాలిట స్వర్గధామంగా మారిందని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో బెంగళూరు కంటే ఎక్కడ వెనుకబడ్డామో పరిశీలించుకుంటున్నామని ఆయన అన్నారు. మూడు ‘డి’లదే భవిష్యత్ అంతా.. అని చెప్పిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ హబ్‌గా మారుతోందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతామన్నారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్‌లోనే తయారైందని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కేటీఆర్ తెలిపారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే సత్తా చాటింది.. రాబోయే రెండు దశాబ్దాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మంచి భవిష్యత్తు ఉందని వెల్లడించారు. హెల్త్‌కేర్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అవకాశం ఉందని.. డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్.. ఈ మూడు ‘డి’లదే భవిష్యత్ అంతా అని కేటీఆర్ వివరించారు. ఇవాళ హైదరారబాద్ హైచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ’ సదస్సులో కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయని.. ఐదు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ రెండో చిరునామాగా ప్రకటించాయని తెలిపారు.
వివిధ కంపెనీలు ప్రకటించిన పెట్టుబడుల్లో 40 శాతం ఇప్పటికే కార్యరూపం దాల్చాయని స్పష్టం చేశారు. ఒక్కరోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ రాలేదన్న కేటీఆర్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతూనే వృద్ధిని కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని.. అందుకే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
An exciting take away are message mindful of upcoming @COP26 on enthusiasm for electric vehicles and aspiration to be no.1 for solar generation.@KTRTRS also quoted the 3 D’s: –
Digitise Decarbonise ⭐ Decentralise
Look forward to exploring ?? collaboration in these areas. pic.twitter.com/Ei8a9SVPnR
— Dr Andrew Fleming (@Andrew007Uk) November 22, 2020