ఆ ఇద్దరిలో ఒకరే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విజేత.. జోస్యం చెప్పిన కౌశల్..

మరో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 4 ముగియనుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ప్రతీ టాస్క్‌లోనూ 100 శాతం ఎఫర్ట్ పెడుతూ టైటిల్ వేటలో ఒక్కో మెట్టు..

  • Ravi Kiran
  • Publish Date - 2:11 pm, Sun, 22 November 20
ఆ ఇద్దరిలో ఒకరే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విజేత.. జోస్యం చెప్పిన కౌశల్..

Bigg Boss 4: మరో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 4 ముగియనుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ప్రతీ టాస్క్‌లోనూ 100 శాతం ఎఫర్ట్ పెడుతూ టైటిల్ వేటలో ఒక్కో మెట్టు ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో అభిజిత్‌, అఖిల్‌, హారిక‌, సోహైల్‌, మోనాల్‌, అరియానా, అవినాష్‌, లాస్యలు ఉండగా.. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఇక మిగిలిన ఏడుగురిలో ఇద్దరు తర్వాత రెండు వారాల్లో ఎలిమినేషన్ కానుండగా.. చివరి ఐదుగురు టైటిల్ వేటలో ఉంటారు. ఆ టాప్ ఐదుగురు ఎవరు ఉంటారన్న దానిపై దానిపై బిగ్ బాస్ మాజీ టైటిల్ విన్నర్ కౌశల్ మండా జోస్యం చెప్పారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో హౌస్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు.

కాగా, అభిజిత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని.. అతడు ఫిజికల్ టాస్క్‌ల్లో పెద్దగా పాల్గొనలేకపోయినా.. అతడు చెప్పేది ప్రతీది ప్రేక్షకులకు అర్ధమవుతోందని కౌశల్ వివరించాడు. అభి ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాడని తెలిపాడు. అలాగే సోహైల్ కూడా మంచి ప్లేయర్.. కోపమే అతడి బలం. అతడు కూడా టాప్ 2లో ఉంటాడు. ఇక అఖిల్ అన్ని టాస్కులలోనూ ఎఫర్ట్స్ పెట్టాడు. కేవలం సీక్రెట్ రూమ్ టాస్క్ ఒకటే అతడికి మైనస్ అయింది. అఖిల్ కూడా ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాడని కౌశల్ తెలిపాడు. ఇక ఆ తర్వాత అరియానా, అవినాష్/హారికలు టాప్5లో ఉంటారని కౌశల్ జోస్యం చెప్పాడు.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!