AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీ రంగంలో క్యాంపస్ నియామకాల జోరు

ఐటీ రంగంలో మళ్లీ జోష్‌ పెరిగింది. గత మూడేళ్లుగా కొంత స్తబ్దుగా ఉన్న ఐటీ కంపెనీలు తాజాగా నియామకాల జోరు పెంచాయి. నాలుగేళ్ల క్రితం ఐఐటీ విద్యార్థులకు రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనాలు ఆఫర్‌ చేసిన మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గోల్డ్‌మెన్‌శాక్స్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు ప్రతిభావంతుల కోసం మన ఐఐటీల ముందు క్యూ కట్టాయి. సగటున రూ.కోటి వార్షికవేతనం ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నాయి. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా రూ.1.40 కోట్లు, కనిష్టంగా రూ.41 లక్షలు ఇస్తామని […]

ఐటీ రంగంలో క్యాంపస్ నియామకాల జోరు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 6:36 PM

Share

ఐటీ రంగంలో మళ్లీ జోష్‌ పెరిగింది. గత మూడేళ్లుగా కొంత స్తబ్దుగా ఉన్న ఐటీ కంపెనీలు తాజాగా నియామకాల జోరు పెంచాయి. నాలుగేళ్ల క్రితం ఐఐటీ విద్యార్థులకు రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనాలు ఆఫర్‌ చేసిన మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గోల్డ్‌మెన్‌శాక్స్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు ప్రతిభావంతుల కోసం మన ఐఐటీల ముందు క్యూ కట్టాయి. సగటున రూ.కోటి వార్షికవేతనం ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నాయి. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా రూ.1.40 కోట్లు, కనిష్టంగా రూ.41 లక్షలు ఇస్తామని పేర్కొంటున్నాయి. అలాగే మొదటిసారిగా అమెరికాకు చెందిన అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, సిటీ గ్రూప్, పేపాల్‌ వంటి సంస్థలు ఐఐటీ, ఎన్‌ఐటీ, ప్రముఖ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లకు రావడం విశేషం. ఒక్కో విద్యార్థికి ఒకేసారి ఐదారు ఉద్యోగావకాశాలు కూడా వస్తు న్నాయి. జూలై మొదటి వారంలో ప్రారంభమైన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ జోరు సెప్టెంబర్‌ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐఐటీలు, నిట్‌లు మాత్రమే కాకుండా మంచి ర్యాంకింగ్‌ కలిగి ఉన్న ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ ఊపందుకుంది. గత మూడేళ్లుగా పాక్షిక నియామకాలకు పరిమితమైన ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్, క్యాప్‌ జెమినీ, యాక్సెంచర్‌ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల నియామకానికి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి.

ఈ ఏడాది హైదరాబాద్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులకు క్యాంపస్‌ నియామకాలు, జాబ్‌ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నాస్కామ్‌ (దక్షిణ భారత) డైరెక్టర్‌ ఒకరు వెల్లడించారు. మునుపెన్నడూ లేని విధంగా అనేక బహుళజాతి కంపెనీలు ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ చేపడుతున్నాయని ఆయన వెల్లడించారు. సీబీఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ రూ.41 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌ చేసింది. జేపీ మోర్గాన్‌ చేజ్‌ కంపెనీ ఈ కాలేజీలో 40 మందికి పైగా విద్యార్థులకు భారీ వేతనాలను ఆఫర్‌ చేసింది.

మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే
మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే
ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..! అధికారం, ఆదాయం తగ్గే ఛాన్స్
ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..! అధికారం, ఆదాయం తగ్గే ఛాన్స్
ఓటర్ ఐడీ లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఎలా అంటే?
ఓటర్ ఐడీ లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఎలా అంటే?
పాకిస్తాన్ పాలిట ముగ్గురు విలన్లు.. 2 ఏళ్ల ఓటమి రుచి మరోసారి..?
పాకిస్తాన్ పాలిట ముగ్గురు విలన్లు.. 2 ఏళ్ల ఓటమి రుచి మరోసారి..?
మహాలక్ష్మీ రాజయోగం అంటే ఏమిటి? జాతకంలో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?
మహాలక్ష్మీ రాజయోగం అంటే ఏమిటి? జాతకంలో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?
హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా
హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా
ప్యాన్‌ ఇండియా అంటే హింసేనా !! విజయానికి అదే మార్గమా
ప్యాన్‌ ఇండియా అంటే హింసేనా !! విజయానికి అదే మార్గమా
నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు
నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు
ప్రేమికుల కోసమే ఈ ఫోక్ సాంగ్.. రాము రాథోడ్ అదరగొట్టేశాడు..
ప్రేమికుల కోసమే ఈ ఫోక్ సాంగ్.. రాము రాథోడ్ అదరగొట్టేశాడు..
అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..
అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..