సిడ్నీలో సాజిద్‌కు ఆరు గన్స్ ఎలా వచ్చాయి..? హైదరాబాద్ మూలాలపై పోలీసుల వర్షెన్ ఏంటి?
సిడ్నీ బోండీ బీచ్ కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాజిద్ అక్రమ్ బ్యాగ్రౌండ్ తోపాటు.. అతడి వ్యవహారాలన్నింటిపైనా ఫోకస్ పెట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గన్స్ జారీ ప్రక్రియ కఠినంగా ఉండే ఆస్ట్రేలియాలో సాజిద్ దగ్గర ఆరు గన్స్ లభ్యమవడం కలకలం రేపుతోంది. ఇంతకీ.. సాజిద్‌కు ఆరు గన్స్ ఎలా ఎలా వచ్చాయి..? హైదరాబాద్ మూలాలపై తెలంగాణ పోలీసుల వర్షెన్ ఏంటి..?

సిడ్నీ బోండీ బీచ్ కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్ట్రేలియాలో సాజిద్ బ్యాగ్రౌండ్తోపాటు.. అతడి వ్యవహారాలన్నింటిపై దృష్టి సారించారు. సాజిద్‌కు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సాజిద్ అక్రమంగా గన్స్‌ను కలిగి ఉన్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తేల్చారు.
సాజిద్ అక్రమ్ దగ్గర ఏకంగా ఆరు తుపాకులు ఉన్నట్లు గుర్తించారు. వాటితోనే సిడ్నీ బీచ్‌లో తండ్రీ కొడుకులు కాల్పులకు తెగబడ్డారు. సాజిద్ అక్రమంగా గన్ లైసెన్స్‌ను పొందినట్లు కూడా ఐడెంటిఫై చేశారు. పదేళ్ల నుంచి సాజిద్ గన్స్‌ను సేకరించినట్లు తేల్చిన సిడ్నీ పోలీసులు.. ఈ ఆరు గన్స్కు లైసెన్స్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి.. ఆస్ట్రేలియాలో గన్స్ జారీ ప్రక్రియ కఠినతరంగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సులువుగా ఆరు గన్స్ ఎలా సంపాదించాడు?.. లైసెన్స్ ఇచ్చేముందు పాత కేసులు, హిస్టరీ షీట్ వెరిఫై చేసి మరీ గన్ లైసెన్స్ ఇచ్చే దేశంలో అంత ఈజీగా ఆరు గన్స్ ఎలా పొందాడు?.. అనే అంశాలు అక్కడి పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. ఇదిలావుంటే.. హైదరాబాద్‌తోనూ సాజిద్ అక్రమ్‌కు సంబంధాలు ఉండడంతో ఇక్కడి బ్యాగ్రౌండ్‌పైనా తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లోనే పాస్‌పోర్ట్ పొందిన సాజిద్.. స్టూడెంట్ వీసాతో 1998లో ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు గుర్తించారు. గత 25 ఏళ్లలో కేవలం ఆరు సార్లు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లినట్లు ఆధారాలు సేకరించారు. అయితే.. సాజిద్‌పై తెలంగాణలో ఎలాంటి క్రైమ్ రికార్డులు లేవని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




