కాబూల్‌లో బాంబు పేలుళ్లు.. 10మంది మృతి

శనివారం ఆఫ్ఘన్ రాజధానికి తూర్పున ఒక ప్యాసింజర్ బస్సు ప్రయాణిస్తోన్న సమయంలో బాంబు పేలడంతో 10 మంది పౌరులు మృతి చెందారని అధికారులు తెలిపారు.

కాబూల్‌లో బాంబు పేలుళ్లు.. 10మంది మృతి
Follow us

|

Updated on: Oct 24, 2020 | 8:55 PM

శనివారం ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌కి తూర్పున ఒక ప్యాసింజర్ బస్సు ప్రయాణిస్తోన్న సమయంలో బాంబు పేలడంతో 10 మంది పౌరులు మృతి చెందారని అధికారులు తెలిపారు.  ఓ విద్యాలయం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో పాఠశాల చిన్నారులు  కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సూసైడ్ అటాక్‌గా సమాచారం అందుతోంది. యుద్దం ముగించడానికి ఖతార్లో తాలిబాన్, ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరిపినప్పటికీ ఇటీవలి కాలంలో హింస పెరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో బస్సు కాబూల్ నుంచి  ఘజ్ని, వాహీదుల్లా జుమాజాడాకు వెళుతుండగా బాంబు పేలిందని ఘజ్ని గవర్నర్ ప్రతినిధి తెలిపారు. నలుగురు పోలీసులు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్‌లో గాయపడ్డారు. ఈ దాడి తాలిబాన్ల పనేనని ఘజ్ని పోలీసు ప్రతినిధి ఆడమ్ ఖాన్ సీరత్ పేర్కొన్నారు. గత నెలలో ప్రభుత్వంతో శాంతి చర్చలలో జరినప్పటికీ, ఆధిక్యత ప్రదర్శించే ప్రయత్నంలో తాలిబాన్లు హింసను పెంచారు. 

Also Read :

Breaking : హత్రాస్ కేసు విచారణ అధికారి భార్య ఆత్మహత్య

అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !