మంచి మనసు చాటుకున్న హృతిక్ రోషన్..

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన వంతు సహాయం అందించారు. ఈ కరోనా కష్టకాలంలో సుమారు 100 మంది బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లకు హృతిక్ రోషన్ అండగా నిలిచాడు.

మంచి మనసు చాటుకున్న హృతిక్ రోషన్..

Edited By:

Updated on: Jul 26, 2020 | 2:36 PM

Bollywood Hero Hritik Roshan Helped 100 Back Ground Dancers:  దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం సినిమా పరిశ్రమపై ఎక్కువగా పడింది. గత నాలుగు నెలలుగా షూటింగులు లేకపోవడంతో ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు, బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లు, టెక్నీషియన్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు వీరిని ఆదుకునేందుకు ముందుకు రాగా.. తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన వంతు సహాయం అందించారు. ఈ కరోనా కష్టకాలంలో సుమారు 100 మంది బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లకు హృతిక్ రోషన్ అండగా నిలిచాడు. వారి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బును నేరుగా జమ చేశాడు. ఇక ఈ విషయాన్ని బాలీవుడ్ డాన్సర్స్ కో-ఆర్డినేటర్ రాజు సూరానీ మీడియాకు వెల్లడించగా.. హృతిక్ సాయానికి డ్యాన్సర్లు హర్షం వ్యక్తం చేశారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!

కిమ్ ఇలాకాలో మొదటి కరోనా కేసు.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్..!

ఏపీలోని ఆ ప్రాంతంలో వారం రోజుల లాక్‌డౌన్..

గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి మరో 21 మందులు..!