బాలీవుడ్‌లో మరో విషాదం.. అనుమానాస్పద రీతిలో నటి అర్య బెనర్జీ మృతి.. హత్య, ఆత్మహత్య ..?

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.  మోడల్‌, నటి  అర్య బెనర్జీ  అనుమానస్పద రీతిలో మృత్యువాతపడ్డారు. కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం  ఆమె శవమై కనిపించారు.

బాలీవుడ్‌లో మరో విషాదం.. అనుమానాస్పద రీతిలో నటి అర్య బెనర్జీ మృతి.. హత్య, ఆత్మహత్య ..?

Updated on: Dec 12, 2020 | 11:30 AM

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.  మోడల్‌, నటి  అర్య బెనర్జీ  అనుమానస్పద రీతిలో మృత్యువాతపడ్డారు. కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం ఆమె శవమై కనిపించారు. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి సిల్క్‌ స్మిత బయోపిక్‌ ‘ది డర్టీ పిక్చర్’‌లో షకిలా పాత్ర పోషించారు.  అయితే నిన్న పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా ఎంతసేపటికీ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది.

అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లిచూడగా బెనర్జీ నిర్జీవంగా కనిపించారు. అయితే ఆమె వంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగా ఉంటున్నారు. పనిమనిషి అందిచిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు.