కనికరం లేని యజమాని.. పెంపుడు కుక్క విసిగిస్తోందని దారుణంగా ఏం చేశాడో తెలుసా?

కొంతమంది పెంపుడు జంతువులను చాలా ఇష్టంగా చూసుకుంటారు. ప్రేమతో ఆదరిస్తారు. వాటితో గడుపుతూ మానసిక ఆనందాన్ని పొందుతారు.

కనికరం లేని యజమాని.. పెంపుడు కుక్క విసిగిస్తోందని దారుణంగా ఏం చేశాడో తెలుసా?
Follow us
uppula Raju

|

Updated on: Dec 12, 2020 | 11:07 AM

కొంతమంది పెంపుడు జంతువులను చాలా ఇష్టంగా చూసుకుంటారు. ప్రేమతో ఆదరిస్తారు. వాటితో గడుపుతూ మానసిక ఆనందాన్ని పొందుతారు. కానీ ఇక్కడ ఓ పెద్దాయన విచిత్రంగా ప్రవర్తించారు. పెంపుడు కుక్క విసిగిస్తోందని కారుకు కట్టేసి ఈడ్చుకెళ్లాడు. దీంతో అతడిపై జంతుప్రేమికులు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో యూసఫ్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క బాగా విసిగిస్తోందని దూరంగా విడిచిపెట్టి రావాలనుకున్నాడు. అందుకోసం ఏం ఆలోచించకుండా కుక్కను కారుకు కట్టి బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకొని వెళ్లాడు. దీంతో కుక్క రోడ్డుపై బొర్లుతూ వస్తుండటంతో తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని గమనించిన ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అంతేకాకుండా యూసప్‌ని అడ్డుకొని ఆ కుక్కను ఎందుకు అలా హింసిస్తున్నావ్ అని అడిగితే .. నీ కెందుకు నీ పని నువ్ చూసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. వెంటనే కుక్క మెడలో ఉన్న తాడు విప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అయితే సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో యూసప్ తీరుపై అందరు మండిపడుతున్నారు. అంతేకాకుండా జంతుప్రేమికులు అతడిపై యానిమల్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గాయపడిన కుక్కను పశువైద్య ఆస్పత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!