AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌లో మరో విషాదం..నటుడు అసిఫ్ బాస్రా ఆత్మహత్య

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అసిఫ్ బాస్రా ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని మెక్​లాడ్గంజ్​లోని అద్దె ఇంట్లో గత ఐదేళ్ల నుంచి ఉంటున్నారు.

బాలీవుడ్‌లో మరో విషాదం..నటుడు అసిఫ్ బాస్రా ఆత్మహత్య
Sanjay Kasula
| Edited By: |

Updated on: Nov 12, 2020 | 6:27 PM

Share

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అసిఫ్ బాస్రా ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని మెక్​లాడ్గంజ్​లోని అద్దె ఇంట్లో గత ఐదేళ్ల నుంచి ఉంటున్నారు. ఫారిన్ గర్ల్​ఫ్రెండ్​ కూడా ఈయనతో పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన వయసు కేవలం 53 సంవత్సరాలు మాత్రమే. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

అసిఫ్ బాస్రా బాలీవుడ్ లో ఏక్ విలన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, క్రిష్ 3, జబ్ వి మెట్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. దాంతో పాటు తమిళనాట సూర్య హీరోగా వచ్చిన అంజాన్ సినిమాలో నటించి దక్షిణాది ప్రేక్షకులను కూడా మెప్పించారు. ఈ సినిమా తెలుగులో సికిందర్ పేరుతో విడుదలైంది. ఈ ఏడాది హాట్ స్టార్ లో విడుదలైన హోస్టెజెస్ వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

బాలీవుడ్లో డిప్రెషన్ అనే పదం ఈ మధ్య చాలా వినిస్తోంది. జూన్ 14న స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు కూడా ఇలాగే సూసైడ్ చేసుకోవడం సినిమా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఆసిఫ్ మరణవార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న నటులు దర్శకులు నిర్మాతలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైన నటుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అసలు ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?