AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిగ్-29కె పైలట్ నిశాంత్ సింగ్‌ శవమై తేలాడు..నెటిజన్స్‌కు కన్నీళ్లు మిగిల్చిన కమాండర్

మిగ్ -29 కె పైలట్ నిశాంత్ సింగ్‌ చివరకు శవమై తేలాడు. నవంబర్ 26 న అరేబియా సముద్రంలో మిగ్ -29 కె ట్రైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే.

మిగ్-29కె పైలట్ నిశాంత్ సింగ్‌ శవమై తేలాడు..నెటిజన్స్‌కు కన్నీళ్లు మిగిల్చిన కమాండర్
Anil kumar poka
|

Updated on: Dec 07, 2020 | 5:53 PM

Share

MiG-29k pilot Nishant Singh : మిగ్ -29కె పైలట్ నిశాంత్ సింగ్‌ చివరకు శవమై తేలాడు. నవంబర్ 26 న అరేబియా సముద్రంలో మిగ్ -29 కె ట్రైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పైలట్ నిశాంత్ సింగ్‌ను గుర్తించే ఆపరేషన్ కొనసాగింది. చివరికి సీబెడ్ కు 70 మీటర్ల లోతులో ఉండే నీటిలో ఆయన మృతదేహం లభ్యమైంది. గోవా కోస్ట్ కు 30 మైళ్ల దూరంలో ఆయన డెడ్ బాడీ దొరికింది. దాదాపు పది రోజుల పాటు గాలించి చివరకు ఆయన మృతదేహాన్ని కనుకున్నారు. నిశాంత్ సింగ్ మృతదేహాన్ని నిర్ధారించడానికి డీఎన్ఎ పరీక్షలు నిర్వహించారు.

నిశాంత్ సింగ్‌ను గుర్తించడానికి నావికాదళాలు చాలా కష్టపడ్డాయి. తీరం వెంబడి ఉన్న జలాల్లో శోధించడానికి భారత నావికాదళం ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌ను నియమించారు. మెరైన్, కోస్టల్ పోలీసులు కూడా ముమ్మరంగా గాలించారు. అయితే విమానం కూలిన తర్వాత అందులో ఉన్న మరో పైలట్ ను రక్షించిన విషయం తెలిసిందే. కాగా నిషాంత్‌ సింగ్‌కు సంబంధించిన ఓ లెటర్‌ ఆయన తప్పిపోయినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో వైరలైంది. నిషాంత్‌‌కు ఏడు నెలల క్రితం వివాహమైంది. ఆ సమయంలో ఆయన సీనియర్‌ అధికారుల అనుమతి కోరుతూ రాసిన లెటర్ చాలా క్రియేటివ్‌గా ఉంది.

“పెళ్లి చేసుకోవడం అంటే జీవితాన్ని త్యాగం చేయడం వంటిదే.. తెలిసి తెలిసి ఇందులో​కి దూకుతున్నాను.. ఇక జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయను.. కంబాట్‌లో ఓ పక్క వేడిని భరిస్తూనే సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవడం అలవాటైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. నా జీవితాన్ని త్యాగం చేయాలని భావిస్తూ స్వయంగా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అనుమతి కావాలి’ ” అంటూ ఆయన చమత్కారంగా తన పైఅధికారులకు లేఖ రాశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో నెటిజన్ల అంతా నువ్వు ఎక్కడున్నా క్షేమంగా తిరిగిరావాలి నిషాంత్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ విధి వక్రీకరించింది. అందరికీ ఆయనకు కన్నీళ్లు మిగిల్చారు.

కాగా ఇండియ‌న్ నేవీ వ‌ద్ద దాదాపు 40కు పైగా మిగ్ 29కే యుద్ధ విమానాలు ఉన్నాయి. గోవాతో పాటు ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య యుద్ధ నౌక‌పై వాటిని ఆప‌రేట్ చేస్తున్నారు. గ‌త ఏడాది కాలంలో మిగ్ విమానాలు ప్ర‌మాదానికి గురికావ‌డం ఇది మూడ‌వ‌సారి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గోవా వ‌ద్ద ప‌క్షుల ఢీకొట్ట‌డంతో మిగ్ కూలింది. అయితే ఆ ప్ర‌మాద స‌మ‌యంలో ఇద్ద‌రు పైల‌ట్లు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో గోవా స‌మీపంలోనే ఓ మిగ్‌29కే కూలింది. అప్పుడు కూడా ఇద్ద‌రు పైల‌ట్లు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు