నిద్రలో వుండగా బీపీ పెరిగితే అంతే!

గాఢ నిద్రలో వుండగా బీపీ పెరిగితే ఏమవుతుంది ? అసలు నిద్రలో వుండగా బీపీ (రక్తపోటు) పెరుగుతుందా ? అలా పెరిగితే అప్పటికప్పుడు ప్రమాదమా ? లేక భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు సంకేతమా ? అమెరికా, జపాన్ సంయుక్త అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.

  • Rajesh Sharma
  • Publish Date - 7:15 pm, Mon, 2 November 20
నిద్రలో వుండగా బీపీ పెరిగితే అంతే!

Blood pressure while sleeping is dangerous: గాఢ నిద్రలో వుండగా రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) పెరిగితే ఏమవుతుంది ? అసలు నిద్రలో వుండగా రక్తపోటు పెరుగుతుందా ? ఒకవేళ పెరిగినా అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుతుందా ? అలా చేరితే.. ఏం జరుగుతుంది ? మనిషి ప్రాణాలకే ప్రమాదమా ? ఈప్రశ్నలకు సమాధానం చెబుతోంది తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం నివేదిక.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఫ్లాగ్ షిప్ జర్నల్‌లో ఓ కీలక మైన, ఆసక్తికరమైన నివేదికను ప్రచురించింది. మనం నిద్రలో వుండగా.. రక్తపోటు పెరుగుతుందా ? లేదా ? అన్న అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం వుందంటోంది ఆ నివేదిక. నిద్రలో రక్తపోటులో హెచ్చు తగ్గులు తరచూ కనిపిస్తుంటే.. అది ప్రమాదమేనని తేల్చింది ఈ నివేదిక.

ఎవరైతే నిద్రలో వుండగా వారి రక్తపోటులో తీవ్రమైన హెచ్చతగ్గులు నమోదవుతాయో వారికి హ‌ృదయ సంబంధమైన సమస్యలు వచ్చేందుకు అవకాశం అతిగా వుంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం. ఈ మేరకు ఈ అధ్యయనం నివేదికను సోమవారం అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించారు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్, జపాన్ అంబులాటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ప్రాస్పెక్టివ్ సంస్థలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. మొత్తం 6 వేల 359 మందిని 2009 నుంచి 2017 మధ్యకాలంలో ఈ పరిశోధనలో భాగంగా పరిశీలించినట్లు జర్నల్ పేర్కొంది. వీరి రక్తపోటులను 24 గంటల పాటు పరిశీలించే వారు. వీరిలో రాత్రి పూట మరీ ముఖ్యంగా వారు నిద్రపోతున్న సమయంలో రక్తపోటులో హెచ్చుతగ్గులు అధికంగా వున్న వారిలో ఆ తర్వాత కాలంలో హృద్రోగాలు తలెత్తినట్లు నివేదికలో ప్రస్తావించారు.

ALSO READ: కాబూల్ వర్సిటీలో భీకర టెర్రర్ అటాక్

ALSO READ: సరిహద్దులో చైనా మరో కుట్ర

ALSO READ: ఐపీఎల్ చివరి దశలో కీలకంగా సన్‌రైజర్స్

ALSO READ: ఏపీ హైకోర్టు రోస్టర్‌లో కీలక మార్పులు

ALSO READ: భార్య శవంతో టూవీలర్ జర్నీ.. చివరికి కటకటాల పాలు

ALSO READ:  పోలవరంపై హైదరాబాద్‌లో కీలకభేటీ