సరిహద్దులో చైనా మరో కుట్ర

భారత్ సరిహద్దులో డ్రాగన్ కంట్రీ మరో కుట్రకు తెరలేపింది. అయితే ఈసారి కశ్మీర్ వైపు కాకుండా ఈశాన్య భారతంలో చిచ్చు రేపేందుకు రెడీ అవుతోంది. ఇదివరకే భారత్, చైనాల మధ్య...

సరిహద్దులో చైనా మరో కుట్ర
Follow us

|

Updated on: Nov 02, 2020 | 5:41 PM

China one-more conspiracy on border: భారత్ సరిహద్దులో డ్రాగన్ కంట్రీ మరో కుట్రకు తెరలేపింది. అయితే ఈసారి కశ్మీర్ వైపు కాకుండా ఈశాన్య భారతంలో చిచ్చు రేపేందుకు రెడీ అవుతోంది. ఇదివరకే భారత్, చైనాల మధ్య అరుణాచల్ ప్రదేశ్ భూభాగం విషయంలో వివాదం కొనసాగుతుండగా.. దానికి మరింత ఆజ్యం పోసేలా చర్యలకు ఉపక్రమించింది చైనా.

టిబెట్ ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఆదేశంపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న డ్రాగన్ కంట్రీ.. తాజాగా చైనాలోని సిచువాన్ నుంచి టిబెట్‌ను కలుపుతూ రైల్వే లైను నిర్మాణానికి పూనుకుంది. చైనా నైరుతీ ప్రాంతంలోని యాన్ సిటీ నుంచి టిబెట్‌లోని లింఝీని కలుపుతూ రైల్వే లైనును ప్రతిపాదించింది. అయితే.. ఈ రైల్వే లైను మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు అత్యంత సమీపం నుంచి నిర్మించాలని చైనా ప్రతిపాదనలు సిద్దం చేసింది.

తాజాగా వెల్లడించిన నిర్మాణ టెండర్ల బిడ్డింగ్ వివరాలలో అరుణాచల్ సరిహద్దులో రెండు టన్నెళ్ళను, ఒక బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. బిడ్డింగ్ ఫైనలైజ్ అయినందున త్వరలోనే ఈ రైల్వే లైను నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోంది.

గత మే నెల నుంచి చైనా వేస్తున్న ప్రతీ అడుగు భారత దేశాన్ని లక్ష్యంగా చేసుకునే చేస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తరచూ యుద్ద వాతావరణం నెలకొంటోంది. లద్ధాఖ్ సరిహద్దులో చైనా దురాగతాలకు అంతే లేకుండా పోతోంది. చైనా సైనికులతో తలపడిన 22 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం విధితమే.

తాజాగా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ.. ఏకపక్ష చర్యలతో ఉద్రిక్తత పెంచుతోంది. తాజాగా భారత్ సరిహద్దుకు సమీపంలో రైల్వే లైను నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించబోతోంది. ఈ దురాగతానికి భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ALSO READ: ఐపీఎల్ చివరి దశలో కీలకంగా సన్‌రైజర్స్

ALSO READ: ఏపీ హైకోర్టు రోస్టర్‌లో కీలక మార్పులు

ALSO READ: భార్య శవంతో టూవీలర్ జర్నీ.. చివరికి కటకటాల పాలు

ALSO READ:  పోలవరంపై హైదరాబాద్‌లో కీలకభేటీ