ఇక మిగిలింది ట్విట్టర్ వార్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాల్!

| Edited By: Srinu

May 19, 2019 | 5:32 PM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఓ పక్క జరుగుతుంటే.. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఎన్నికల ప్రచారాలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ఇలా ఎక్కడ దొరికితే అక్కడ ఇరు పార్టీలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ ఫొటోలతో రెండు పార్టీలు యుద్ధానికి దిగాయి. రీసెంట్‌గా కోల్‌కతాలో జరిగిన అమిత్ షా ర్యాలీలో కొంతమంది త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు విద్యావేత్త ఈశ్వర్ చంద్ర […]

ఇక మిగిలింది ట్విట్టర్ వార్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాల్!
Follow us on

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఓ పక్క జరుగుతుంటే.. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఎన్నికల ప్రచారాలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ఇలా ఎక్కడ దొరికితే అక్కడ ఇరు పార్టీలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ ఫొటోలతో రెండు పార్టీలు యుద్ధానికి దిగాయి.

రీసెంట్‌గా కోల్‌కతాలో జరిగిన అమిత్ షా ర్యాలీలో కొంతమంది త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు విద్యావేత్త ఈశ్వర్ చంద్ర బిద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ చాలామంది బీజేపీ నేతలు తమ ట్విట్టర్ ప్రొఫైల్ ఫోటోగా ఈశ్వర్ చంద్ర బిద్యాసాగర్ ఫోటోను పెట్టుకున్నారు. అలాగే బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడిగా పోలుస్తూ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ ట్విట్టర్ ప్రొఫైల్ ఫోటోగా మహాత్మా గాంధీని పెట్టుకున్నారు. ఇలా ఒకరినొకరు చురకలు అంటించుకుంటున్నారు.

మరోవైపు ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ హెగ్డే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనితో బీజేపీ సంరక్షణలో పడింది. ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. సాధ్వి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. కానీ గాంధీని అవమానించినందుకు ఆమెను క్షమించలేమని అన్నారు.