రెండున్నరేళ్లు మీరు.. మరో రెండున్నరేళ్లు మేము..

సార్వత్రిక ఎన్నికలతొ పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటిచేయనున్న శివసేన – బీజేపీ ఇరు పార్టీలు పలు షరతులుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా మహారాష్ట్ర సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామనే ఒప్పందంతోనే ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరిందని శివసేన మంత్రి రామ్ దాస్ కదం తెలిపారు. ఈ ఒప్పందానికి కట్టుబడకూడదని భావిస్తే ఎన్నికలకు ముందుగానే బీజేపీ తన పొత్తును రద్దుచేసుకోవచ్చని బుధవారం స్పష్టం చేశారు. బీజేపీ, శివసేన మధ్య రెండు ప్రధాన అంశాల గురించి ఒప్పందం […]

రెండున్నరేళ్లు మీరు.. మరో రెండున్నరేళ్లు మేము..

Edited By:

Updated on: Mar 07, 2019 | 6:14 PM

సార్వత్రిక ఎన్నికలతొ పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటిచేయనున్న శివసేన – బీజేపీ ఇరు పార్టీలు పలు షరతులుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా మహారాష్ట్ర సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామనే ఒప్పందంతోనే ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరిందని శివసేన మంత్రి రామ్ దాస్ కదం తెలిపారు. ఈ ఒప్పందానికి కట్టుబడకూడదని భావిస్తే ఎన్నికలకు ముందుగానే బీజేపీ తన పొత్తును రద్దుచేసుకోవచ్చని బుధవారం స్పష్టం చేశారు. బీజేపీ, శివసేన మధ్య రెండు ప్రధాన అంశాల గురించి ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. సీఎం పదవిని చెరి సగం కాలం పాటు పంచుకోవటం ఒకటి కాగా.. కొంకణ్‌ ప్రాంతంలోని నానార్‌ రిఫైనరీ ప్రాజెక్టును రద్దు చేయడం రెండోదని వెల్లడించారు. కాగా, ఒప్పందం జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర మంత్రి చంద్రకాంత్‌ పటేల్‌ పొత్తును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రామ్‌దాస్‌ పరోక్షంగా మండిపడ్డారు.