ఎమర్జెన్సీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్య, అపహాస్యం చేసిన బీజేపీ, ఇన్నాళ్లకు నోరు విప్పారని విమర్శ

ఎమర్జెన్సీ విధింపు పొరబాటేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను బీజేపీ అపహాస్యం చేసింది. ఇది  హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 4:04 pm, Wed, 3 March 21
ఎమర్జెన్సీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్య, అపహాస్యం చేసిన బీజేపీ, ఇన్నాళ్లకు నోరు విప్పారని విమర్శ

ఎమర్జెన్సీ విధింపు పొరబాటేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను బీజేపీ అపహాస్యం చేసింది. ఇది  హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. 1975-77 మధ్యకాలంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశంలో సంస్థలేవీ బలహీనపడలేదని, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వీటిని నిర్వీర్యం చేస్తోందని రాహుల్ ఆరోపించారు.  దీనిపై జవదేకర్ స్పందిస్తూ…  ఆర్ఎస్ఎస్ గురించి ఆలోచించడానికి ఆయనకు ఇంతకాలం పట్టిందా అని సెటైర్ వేశారు. అత్యవసర పరిస్థిఠీ విధించినప్పుడు ప్రభుత్వం అన్ని సంస్థలను అణగదొక్కిందని, ఎంపీలను, ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని,  దాదాపు అన్ని పార్టీలను బ్యాన్ చేశారని, వార్తా పత్రికలను మూసివేశారని ఆయన బుధవారం పేర్కొన్నారు.పైగా ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవడానికి రాహుల్ గాంధీకి చాలా  కాలం పట్టిందనివ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ప్రపంచంలోనే ఈ సంస్థ అతి పెద్ద దేశభక్తియుతమైనదిగా ఆయన అభివర్ణించారు. బీజేపీ నేతల్లో చాలామంది నాడు ఎమర్జెన్సీ సమయంలో జైళ్లకు వెళ్ళినవారేనని ప్రకాష్ జవదేకర్ అన్నారు.

కాగా-తన గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ అప్పుడు అత్యవసర పరిస్థితిని విధించడం పొరబాటని,  తప్పు అని రాహుల్ పేర్కొన్న విషయం గమనార్హం కానీ దేశంలో ప్ప్రజాస్వామ్య సంస్థలేవీ ఇప్పటిలాగా  నాడు నిర్వీర్యం కాలేదన్నారు. ఇప్పటి పరిస్థితికి, నాటి పరిస్థితికి మధ్య ఎంతో తేడా ఉందన్నారు. ఈ సంస్థలను ఆర్ ఎస్ ఎస్ తనవారితో నింపేస్తోందన్నారు. ఒకవేళ బీజేపీపై తమ పార్టీ  విజయం సాధించినప్పటికీ ఈ సంస్థల నుంచి వారి బెడదను తాము తప్పించజాలమని వ్యాఖ్యానించారు. డెమోక్రసీ అన్నది క్రమంగా హరించుకుపోతోందని తాను అనడంలేదని, కానీ ఆర్ ఎస్ ఎస్ దాని గొంతు నొక్కేస్తోందని రాహుల్ ఆరోపించారు. అయితే ఆయన వన్నీ అభూత కల్పనలేనని బీజేపీ నేతలు కొట్టి పారేశారు. ప్రజలు ఈ మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ దేశానికి ఆర్ ఎస్ ఎస్ చేసిన సేవలను ఆయన విస్మరించినట్టు ఉందని వారు కౌంటరిచ్చారు.

 

మరిన్ని ఎక్కడ చదవండి:

 

AMMK-BJP Friendship: తమిళనాట రంజుగా రాజకీయం.. అన్నా డిఎంకేపై బీజేపీ గుస్సా.. చిన్నమ్మతో చెలిమికి ఛాన్స్!

World Coronavirus : మళ్ళీ ప్రపంచదేశాల్లో కోరలు చేస్తున్న కోవిడ్.. ఆందోళన వ్యక్తంచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ