బీహార్‌లో దళిత అమ్మాయిపై సామూహిక అత్యాచారం
దేశంలో దళిత యువతపై అత్యాచారాలు పెరుగుతున్నాయి.. మొన్న ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో... ఇవాళ బీహార్‌లోని గయా జిల్లాలో ..! హాథ్రస్ ఘటనపై దేశం యావత్తూ నిరసనలు..

దేశంలో దళిత యువతపై అత్యాచారాలు పెరుగుతున్నాయి.. మొన్న ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో… ఇవాళ బీహార్‌లోని గయా జిల్లాలో ..! హాథ్రస్ ఘటనపై దేశం యావత్తూ నిరసనలు తెలుపుతున్న సమయంలోనే బీహార్‌లో ఇలాంటి ఘటనే జరగడం ఆందోళన కలిగిస్తోంది.. చట్టాలు ఎంత కఠినంగా మారినా మృగాళ్ల వికృత చేష్టలు ఆగడం లేదు.. బీహార్‌లోని గయా జిల్లాలో ఓ దళిత యువతిపై నలుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఆ అవమానాన్ని భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది.. యువతిపై రాహుల్‌కుమార్, చింటు కుమార్, చందన్‌కుమార్‌తో పాటు ఇంకో యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. యవతి మృతదేహానికి గయాలోని మెడికల్ కళాశాలలో పోస్ట్‌మార్టమ్ చేశారు.. పోస్ట్‌మార్టమ్ నివేదిక రావల్సి ఉంది.. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




