సుశాంత్ కేసు..ఆ పోలీసు అధికారికి బలవంతపు క్వారంటైన్ !

సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ కేసు దర్యాప్తు కోసం బీహార్ నుంచి వచ్చిన వినయ్ తివారీ అనే పోలీసు అధికారిని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు..

సుశాంత్ కేసు..ఆ పోలీసు అధికారికి బలవంతపు క్వారంటైన్ !

సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ కేసు దర్యాప్తు కోసం బీహార్ నుంచి వచ్చిన వినయ్ తివారీ అనే పోలీసు అధికారిని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వారీ చర్యకు పాల్పడ్డారని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తెలిపారు. ఆయనకు వారు ఐ పీ ఎస్ మెస్ లో వసతి కూడా కల్పించలేదని, గుర్ గావ్ గెస్ట్ హౌస్ లో ఉంచారని పాండే ట్వీట్ చేశారు. సుశాంత్  కేసులో ఇప్పటికే ముంబై పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చర్య మరింత విమర్శల పాలవుతోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu