Bigg Boss4: ‘రేస్‌ టు ఫినాలే’లో తలతిక్క టాస్క్ ఇచ్చారంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. టాస్క్ కోసం కిందమీద పడిన హౌస్ మేట్స్

బిగ్ బాస్4 చివరి అంకానికి  చేరుకుంది. సోమవారం ఎపిసోడ్ తో 86 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. హౌస్ లో మిగిలిన సభ్యుల్లో విన్నర్ ఎవరు అవుతారన్నదని పైన ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Bigg Boss4: 'రేస్‌ టు ఫినాలే'లో తలతిక్క టాస్క్ ఇచ్చారంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. టాస్క్ కోసం కిందమీద పడిన హౌస్ మేట్స్
Follow us

|

Updated on: Dec 02, 2020 | 11:04 AM

బిగ్ బాస్4 చివరి అంకానికి  చేరుకుంది. సోమవారంతో 86 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. హౌస్ లో మిగిలిన సభ్యుల్లో విన్నర్ ఎవరు అవుతారన్నదని పైన ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక సోమవారం టికెట్ టు ఫిలాలే రేస్‌లో భాగంగా ఫస్ట్ లెవల్‌లో వింత టాక్స్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ రేస్ టు ఫినాలే మెడల్ గెలుచుకున్నవాళ్లకి ఫినాలే ఎంట్రీ ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్.

ఆడే ఆట తీరుని బట్టి ఫినాలే మెడల్‌కి చేరువ అవుతారని.. అలాగే నామినేషన్స్ నుంచి కూడా తప్పించుకుని నేరుగా ఫినాలే వీక్‌లోకి ఎంటర్ అవుతారని చెప్పాడు బిగ్ బాస్. అదేవిధంగా ఈవారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితేనే ఫినాలే మెడల్ వర్తిస్తుందని స్పష్టం చేసాడు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా  ఇంటి హాల్ లో ఒక ఆవు బొమ్మను ఉంచారు. ప్రతి ఇంటి సభ్యుడికి మిల్క్ స్టేషన్ ఇచ్చారు. ఆవు అంబా అని అరిచినప్పుడల్లా.. ఆవుకి ఉన్న ట్యాబ్స్ ద్వారా వచ్చే పాలను ఇంటి సభ్యులు బాటిల్స్‌లో నింపుకోవాలి. బజర్ మోగే సమయంలో ఎవరి దగ్గర అయితే తక్కువ బాటిల్స్ ఉంటాయో వారు టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తం మూడు రౌండ్లో కలిపి ఎక్కువ పాల బాటిల్స్ ఏ సభ్యుడి దగ్గర ఉంటాయో వారిలో టాప్ నలుగురు లెవల్ 2కి వెళ్తారని చెప్పారు. ఎక్కువ బాటిల్స్ ఉండటమే మీ లక్ష్యమని అందుకోసం మీఇష్టం ఏమైనా చెయ్యొచ్చని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. అమ్మాయిలు అబ్బాయిలు కలిపి టాస్క్ ఇవ్వడం అందరిని షాక్ కు గురిచేసింది.  అబ్బాయిలతో పోటీ పడి అమ్మాయిలు ఎలా పాలు పడతారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ టాస్క్‌ని డిజైన్ చేసారంటూ, చెత్త టాస్క్ అంటూ ప్రేక్షకులు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇక ఈ టాస్క్ కోసం బజర్ మోగగానే ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు పోటీ పడి పాలు పట్టుకోవడానికి కిందా మీదా పడ్డారు. దాంతో రచ్చరచ్చ జరిగింది.