మరోసారి సామాన్యుడిపై గుదిబండ.. గ్యాస్‌ సిలిండర్‌‌ ధర రూ.50 పెంపు.. పెరిగిన ధరలు తక్షణమే అమలు

సామాన్యుడిపై మరో గుదిబండను మోపాయి అయిల్ కంపెనీలు.. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి.

  • Balaraju Goud
  • Publish Date - 11:02 am, Wed, 2 December 20
మరోసారి సామాన్యుడిపై గుదిబండ.. గ్యాస్‌ సిలిండర్‌‌ ధర రూ.50 పెంపు.. పెరిగిన ధరలు తక్షణమే అమలు

సామాన్యుడిపై మరో గుదిబండను మోపాయి అయిల్ కంపెనీలు.. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి. రాయితీ గ్యాస్‌ సిలిండర్‌‌ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కు చేరింది. కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరే అవకాశం ఉంది. అటు, అయిల్ కంపెనీల నిర్ణయంతో జనం ఆందోళనకు గురవుతున్నాయి.