బిగ్‌బాస్ హౌస్‌లో ముగ్గురు శివగాములు… ఎవరో చెప్పిన అభిజిత్… ఆన్సర్‌కు ఫ్యాన్స్ ఫిదా…
అభి ఏకాగ్రత టాస్క్ పూర్తి చేయడంలో మునిగిపోగా.. హారిక.. ఇక్కడున్నవాళ్లలో ఎవరిని శివగామితో పోలుస్తావు? అని అడగ్గా అభి తెలివిగా సమాధానమిచ్చాడు.
bigg boss 4 telugu abhijeet compares sivagami these contestants బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్ మినహా మిగతా ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్‌బాస్ వాళ్లకు వరుస టాస్కులు ఇస్తున్నాడు. వాటిని ఎలాగైనా గెలవాలన్న కసితో కంటెస్టెంట్లు ఆడుతున్నారు. ఇప్పటికే అధికారం టాస్కులో అరియానా, ఓపిక టాస్కులో సోహైల్ గెలిచి.. ప్రేక్షకులను ఓట్లేయమని అభ్యర్థించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఏకాగ్రత అనే మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్లు ఏదైనా పని చేస్తూ 30 నిమిషాలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. మిగతావాళ్లు ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయొచ్చు. అయితే ఈ టాస్క్‌లో అభిజిత్ అత్యధికంగా 27 నిమిషాలు లెక్కించినట్లు విడుదలైన ప్రోమోలో కనిపిస్తోంది.
సూపర్ ఆన్సర్… ఫ్యాన్స్ ఫిదా…
అభి ఏకాగ్రత టాస్క్ పూర్తి చేయడంలో మునిగిపోగా.. హారిక.. ఇక్కడున్నవాళ్లలో ఎవరిని శివగామితో పోలుస్తావు? అని అడగ్గా అభి తెలివిగా సమాధానమిచ్చాడు. శివగామిలో ఉన్న అందం మోనాల్‌కు ఉంది, శివగామిలో ఉన్న టెర్రర్ అరియానాకు ఉంది. శివగామిలో ఉన్న ప్రేమ హారికకు ఉంది అని చాలా క్లారిటీగా చెప్పాడు. దీంతో అభిజిత్ చెప్పిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ ఆన్సర్ అని కొనియాడుతున్నారు.
#BiggBossTelugu4 today at 10 PM on @StarMaa pic.twitter.com/EqvkEezw0q
— starmaa (@StarMaa) December 10, 2020