కరోనా వచ్చింది. తగ్గిపోయింది. ప్రమాదకర వ్యాధిపై పోరాడి గెలిచిన మీరు నిజంగా విజేతలే. అయినా కానీ వ్యాధి తగ్గిపోయిందని లైట్ తీసుకోకండి. కరోనా అనంతరం శ్వాసకోస సంబంధిత సమస్యలు, పిల్లల్లో ఇమ్యూనిటీ లోపాలు తలెత్తే అవకాశం ఉందని ఈ మహమ్మారిపై పరిశోధన చేస్తోన్న ఓ శాస్త్రవేత్త చెప్పారు. భారత హోంమంత్రి అమిత్ షా వ్యాధి నుంచి కోలుకుని నాలుగు రోజులు గడిచిన తర్వాత శ్వాసకోస సమస్యలు, ఒళ్లు నొప్పులతో తిరిగి ఆస్పత్రిలో అడ్మిట్ అయిన నేపథ్యంలో సదరు శాస్త్రవేత్త ఈ హెచ్చరిక చేశారు.
నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్-19 నేషనల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ వీకే పాల్ మాట్లాడుతూ..వ్యాధి అనంతరం వస్తోన్న అనారోగ్యాలు కరోనాకు సంబంధించి కొత్త కోణంగా భావించవచ్చు. దీనిపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఫోకస్ పెట్టారు. ఇటువంటి కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. వ్యాధి తర్వాత కూడా సమస్యలు తలెత్తుతాయన్న అంశాన్ని మనం మైండ్‌లో పెట్టుకోవాలని చెప్పారు.
Also Read :
ఇసుక విధానంలో మార్పులు, మరోసారి జగన్ మార్క్ నిర్ణయాలు !
దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి