వీడు మనిషే కాదు.. పెళ్లి చేసుకుందామని మమతను నమ్మించాడు.. చివరకు ఇలా చేశాడు
మమత ఇటీవల సుధాకర్ పై తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది.. ఈ క్రమంలోనే సుధాకర్ కు వేరే మహిళతో నిశ్చితార్థం జరిగింది.. ఇది తెలిసి మమత ఎందుకు ప్రేమించావంటూ.. అతన్ని నిలదీసింది.. దీని వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని.. ఈ క్రమంలోనే నిందితుడు.. ఆమెను గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమించాడు.. ఆమెను లోబరుచుకున్నాడు.. కట్ చేస్తే.. మరో మహిళతో నిశ్చితార్థం.. ప్రియురాలు పెళ్లి చేసుకోమన్నందుకు.. కిరాతకంగా చంపి పరారయ్యాడు.. ఈ దారుణ ఘటన బెంగళూరులో కలకలం రేపింది.. 39 ఏళ్ల మహిళ అర్థరాత్రి తాను నివసిస్తున్న ఇంట్లో హత్యకు గురైంది. ఈ నేరానికి సంబంధించి పోలీసులు సహోద్యోగిని అరెస్టు చేశారు. బాధితురాలిని మమతగా గుర్తించారు. ఆమె చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్‌కు చెందినది. ఆమె గత ఏడాది కాలంగా జయదేవా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఅవుట్‌లోని ప్రగతిపుర ప్రాంతంలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తోందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి మమత తన ఇంట్లోనే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమె గొంతు కోసి చంపారని తేలింది. ఆ సమయంలో ఆమె స్నేహితురాలు తన స్వగ్రామానికి వెళ్లిందని, ఇంట్లో మమత ఒంటరిగా ఉందని పోలీసులు తెలిపారు.
మృతదేహం లభ్యమైన తర్వాత కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత, ఈ కేసులో నిందితుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఏడాదిగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలన్నందుకు..
ఈ ఘటనపై సౌత్ డివిజన్ డీసీపీ లోకేష్ జగలసర్ మాట్లాడుతూ.. సుధాకర్ మమత పనిచేసే జయదేవా ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్నాడని, వీరిద్దరూ దాదాపు ఏడాది క్రితం పరిచయం ఏర్పడి, తరువాత సంబంధాన్ని పెంచుకున్నారని చెప్పారు. అయితే.. మమత ఇటీవల సుధాకర్ పై తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే, సుధాకర్ కు వేరే మహిళతో నిశ్చితార్థం జరిగింది.. దీని వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పేర్కొన్నారు. డిసెంబర్ 24 అర్థరాత్రి, మమత ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో, సుధాకర్ వంటగది కత్తితో ఆమె గొంతు కోసి, చంపాడని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
