కొవిడ్-19పై పోరు అప్పడే ముగియలేదుః హర్షవర్ధన్

దేశవ్యాప్తంగా కొవిడ్-19పై పోరాటం అప్పడే ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందని తెలిపారు.

కొవిడ్-19పై పోరు అప్పడే ముగియలేదుః హర్షవర్ధన్
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 15, 2020 | 4:22 PM

దేశవ్యాప్తంగా కొవిడ్-19పై పోరాటం అప్పడే ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారిపై మంగళవారంనాడు రాజ్యసభలో మంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్న కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. వైరస్ బారిన పడుతున్న వారి ప్రాణాలకు నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కొవిడ్ మృతుల రేటు 1.67 శాతం, కోలుకుంటున్నవారి రేటు 77.65 శాతంగా ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యను ప్రతి మిలియన్‌కు 3,320కు, మరణాలను ప్రతి మిలియన్‌కు 55కు పరిమితం చేయగలిగామని మంత్రి వెల్లడించారు. అయితే, ఇది ప్రపంచంలోనే కేసులు, మరణాల్లో ఇది కనిష్టమని చెప్పారు.

కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 83,809 కరోనా కేసుల నమోదు కాగా, దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49 లక్షలు దాటింది. ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా బారినపడి 1,054 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 80,776కు చేరుకుంది. కాగా, దేశ ప్రజలకు కరోనా నుంచి విముక్తి కలిగి రోజు ఎంతో దూరం లేదని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.