ట్రంప్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన మెక్‌లెల్లన్ పార్క్
అసలే కరోనా మహమ్మారి, ఆపై ప్రకృతి వైపరీత్యాలు ...అమెరికాను ఆగమాగం చేస్తున్నాయి.. అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావాన్నే చూపుతోంది..
అసలే కరోనా మహమ్మారి, ఆపై ప్రకృతి వైపరీత్యాలు …అమెరికాను ఆగమాగం చేస్తున్నాయి.. అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావాన్నే చూపుతోంది.. ఇదే సమయంలో అనుకోని విపత్తులు అమెరికాను భయపెడుతున్నాయి.. కాలిఫోర్నియాను కార్చిచ్చు కమ్మెస్తోంది.. కాల్చేస్తోంది… పోయిన నెల 22కు మొదలైన కార్చిచ్చు అస్సలు అదుపులోకి రావడం లేదు సరికదా తీవ్రమవుతోంది.. ఇప్పుడీ దావానలం వాషింగ్టన్, ఓరేగాన్, ఇదాహో స్టేట్స్‌కు కూడా వ్యాపించింది.. వెస్ట్‌కోస్ట్, లాస్ ఏంజిలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్, ఫోర్ట్‌లాండ్, ఓరేగాన్ నగరాలకు ఊపిరిసలపనివ్వడం లేదా దావానలం. పొగతో గాలి కలుషితమయ్యింది.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.. ఇప్పటికే 46 లక్షల ఎకరాల అడవి దగ్ధమయ్యింది.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి హెలికాఫ్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు.. ఫైర్ ఇంజన్‌లకైతే లెక్కేలేదు.. కనీసం 30 వేల మంది సిబ్బంది మంటలను ఆర్పడానికి రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. అనేక ఇళ్లు కాలి బూడదయ్యాయి.. అధికారుల లెక్కల ప్రకారం పది మంది చనిపోయారు.. ఈ దావానలం ప్రభావం నవంబర్ మూడున జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది.. మంటలను అదుపు చేయలేని అసమర్థ ప్రభుత్వమని అప్పుడే విపక్షాలు విమర్శలు గుప్పించడం మొదలయ్యింది.. ఈ అంశాన్ని ఎన్నికల్లో అనుకూలంగా మల్చుకోవాలన్నది డెమోక్రాట్ల భావన. మొన్నీమధ్యనే పర్యావరణాన్ని కాపాడటంలో తనను మించినవాడు లేడని గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌కు ఈ పరిణామాలు కాసింత ఇబ్బంది కలిగిస్తున్నాయి.. ట్రంప్ వట్టి మాటల మనిషే తప్ప చేతలుండవని డెమోక్రాట్లు అంటున్నారు.. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు కాలిఫోర్నియాలోని మెక్‌లెల్లన్ పార్క్‌ను ట్రంప్ సందర్శించారు కానీ అక్కడ కూడా ఆయనకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి.. ట్రంప్ కాన్యాయ్ వెళుతున్న సమయంలో స్థానికలు రోడ్డు మీదకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.