AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని నా లాడ్‌ప్రావో పబ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మృతి చెందగా, పలువురు గాయపడి ఆసుపత్రులకు తరలించబడ్డారు. వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగ రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, అనంతరం పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి
Thailand Nightclub Fire Accident
Srilakshmi C
|

Updated on: Jul 13, 2026 | 6:20 AM

Share

బ్యాంకాక్‌, జులై 13: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లోని ఒక పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాంకాక్ ఉత్తర భాగంలోని నా లాడ్‌ప్రావో (Na Ladprao) పబ్‌లో భారీ మంటలు చెలరేగడం, ప్రధాన ద్వారం నుంచి దట్టమైన పొగ వెలువడడం వీడియోలో కనిపించింది. మందపాటి నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడుతుండగా, పబ్‌లోని జనాలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని అక్కడి పోలీసులు తెలిపారు. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.

అనంతరం ప్రధాన మంత్రి అనుటిన్ చార్న్విరాకుల్ ఘటనాస్థలిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని, గాయపడిన పలువురిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పబ్‌లో ప్రదర్శన ఇస్తున్న musician తెలిపిన వివరాల ప్రకారం స్టేజ్ సమీపంలోని ఒక సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగ రావడం గమనించిన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అనంతరం ఒక పేలుడు శబ్దం వినిపించిందని, వెంటనే దట్టమైన పొగ పబ్ అంతటా వ్యాపించిందని చెప్పారు. మృతుల్లో చాలామంది పబ్ వెనుక భాగంలోని మరుగుదొడ్లలో (రెస్ట్‌రూమ్‌లలో) కనిపించారని అనుటిన్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం అనంతరం తీసిన ఫోటోల్లో కాలిపోయిన టేబుళ్లు, కుర్చీలు, పబ్ అంతర్గత భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపించింది.

ఇలాంటి విషాదకర ఘటనలు థాయ్‌లాండ్‌లో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2022లో దేశ తూర్పు ప్రాంతంలోని ఒక మ్యూజిక్ పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు. అలాగే, 2009 జనవరి 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బ్యాంకాక్‌లోని సాంటికా నైట్‌క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 66 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ ప్రమాదం ఇండోర్ ఫైర్‌వర్క్స్ ప్రదర్శన కారణంగా సంభవించినట్లు అప్పట్లో భావించారు.

Follow Us