
సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా..నిర్మాత కమ్ కమెడియన్ బండ్ల గణేశ్ ఇద్దరూ కూడా ఫైర్ బ్రాండ్సే. మైక్ ముందు ఉందంటే చాలు వీరిద్దరూ ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెడతారు. ఒకానొక టైమ్ లో టీవీ చర్చా వేదికలో వీరిద్దరూ పరిధి దాటి విమర్శలు చేసుకున్నారు. వ్యక్తిగతంగా హద్దులుమీరి మరీ తిట్టుకున్నారు. తాజాగా రోజాపై బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
బండ్ల గణేష్ ఇటీవలీ వరకు సినిమా నటుడిగా, నిర్మాతగానే అందరికి తెలుసు. కానీ ఆయనలోని మరో కోణం కూడా ఉండి. బండ్ల.. తెలంగాణలోనే టాప్ మోస్ట్ పౌల్ట్రీ బిజినెస్ మేన్. ఆయన మూవీస్ నిర్మించడానికి కూడా కారణం తన పౌల్ట్రీ పరిశ్రమే అంటాడు. అయితే ఇటీవలి కాలంలో కరోనా వైరస్ కారణంగా చికెన్ ధరలు విపరీతంగా పడిపోయాయి. చికెన్ కి, కరోనాకు సంబంధం లేదని ఎంతమంది నిపుణులు చెప్పినా ప్రజలు ఎందుకైనా మంచిదని మాంసం షాపులవైపు చూడటమే మానేశారు. దీంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ విపరీతమైన నష్టాలను చవిచూసింది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యుల కోసం చికెన్ వండుతూ కనిపించింది. ఇమ్యూనిటి పెరగాలంటే గుడ్లు, చికెన్ ఎంతో అవసరం అని..అందరూ వాటిని తినాలని ఆమె ప్రొత్సహిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. దీంతో తమ పౌల్ట్రీ పరిశ్రమపై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేసింనందుకు.. థాంక్స్ అంటూ బండ్ల గణేష్ రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు.
@RKRojaSelvamani thank you so much ? pic.twitter.com/udOt109NdQ
— BANDLA GANESH (@ganeshbandla) March 28, 2020