ఉమ్మితే ఇక అంతే.. క్రికెట్‌లో కొత్త రూల్…
Ban on Saliva on Ball : కరోనా విజృంభన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలు కాబోతోంది. బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకుల్లేకుండా వినూత్న రీతిలో మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధం చేశారు. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాత్కాలిక నిబంధనలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానంగా… ఉమ్మి (సలైవా)పై నిషేధం, స్థానిక అంపైర్లతో ఆటలను […]
Ban on Saliva on Ball : కరోనా విజృంభన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలు కాబోతోంది. బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకుల్లేకుండా వినూత్న రీతిలో మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధం చేశారు. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాత్కాలిక నిబంధనలను అమలు చేస్తోంది.
వాటిలో ప్రధానంగా… ఉమ్మి (సలైవా)పై నిషేధం, స్థానిక అంపైర్లతో ఆటలను నిర్వహించడం.., టెస్టుల్లో కొవిడ్-19 సబ్‌స్టిట్యూట్, టెస్టుల్లో మూడు డీఆర్‌ఎస్ రివ్యూలు, వన్డేలు, టీ20లకు రెండు రివ్యూలు, టెస్టు జెర్సీపై అదనపు లోగోకు అనుమతి ఇచ్చింది. ఐసీసీ(ICC) కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి.
మార్పులు ఇలా ఉండనున్నాయి…
కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశమున్న ఉమ్మిపై నిషేధం విధించింది. చెమటను వినియోగించేందుకు అనుమతిచ్చింది. టెస్టు ల్లో బౌలర్లు బంతిపై ఉమ్మి ఉపయోగిస్తే… కొన్నిసార్లు పొరపాటుగా భావిస్తారు. కానీ అదే పనిగా ఉమ్మిని వాడితే ఇన్నింగ్స్‌కు రెండు సార్లు హెచ్చరిస్తారు. అప్పటికీ మార్పు రాకుంటే పెనాల్టీ కింద బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు కలుపుతారు.
సబ్‌స్టిట్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్…
టెస్టుల్లో కొవిడ్-19 సబ్‌స్టిట్యూషన్‌కు ఓకే చెప్పింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ ఆటగానికైనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలితే.. అతని స్థానంలో మరొకరికి అనుమతించనున్నారు.