బాలయ్య అమరావతి యాత్ర వాయిదా.. కారణమిదే

ముందుగా అనుకున్నట్లు జరిగితే.. జనవరి 16 (గురువారం) టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అమరావతి ఏరియాలో ఉద్యమిస్తున్న ప్రజలకు సంఘీభావంగా ఆ ప్రాంతంలో పర్యటించాలి. కానీ ఉన్నట్లుండి ఆయన తన పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకున్నారు. జనవరి 18వ తేదీన బాలయ్య… అమరావతి ఏరియాలో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే చివరి నిమిషంలో బాలకృష్ణ తన పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారు? ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. […]

బాలయ్య అమరావతి యాత్ర వాయిదా.. కారణమిదే

Updated on: Jan 16, 2020 | 5:10 PM

ముందుగా అనుకున్నట్లు జరిగితే.. జనవరి 16 (గురువారం) టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అమరావతి ఏరియాలో ఉద్యమిస్తున్న ప్రజలకు సంఘీభావంగా ఆ ప్రాంతంలో పర్యటించాలి. కానీ ఉన్నట్లుండి ఆయన తన పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకున్నారు. జనవరి 18వ తేదీన బాలయ్య… అమరావతి ఏరియాలో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే చివరి నిమిషంలో బాలకృష్ణ తన పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారు? ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

గత నెల రోజులుగా అమరావతి ఏరియా రాజధాని సంబంధ ఆందోళనలతో అట్టుడికిపోతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు అమరావతి ఏరియా ప్రజలకు అండగా ఉద్యమంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు ఆల్‌మోస్ట్ ప్రతీ రోజు రాజధాని రిలేడెట్ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. ఆయనతోపాటు ఆయన కుటుంబం మొత్తం రాజధాని ఆందోళనలో బిజీబిజీగా వుంది. కానీ చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళన పర్వంలో దర్శనమివ్వలేదు.

అందుకోసమే సంక్రాంతి మర్నాడు రాజధాని ఏరియాలో పర్యటించడం ద్వారా రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తున్న ప్రజలకు సంఘీభావం ప్రకటించాలని తలపెట్టారు బాలకృష్ణ. గురువారం సడన్‌గా తన పర్యటనను రెండు రోజుల పాటు వాయిదా వేశారు. ఇందుకు కారణమేంటంటే.. పార్టీ వర్గాలు ఒక రకంగాను, సినీ పరిశ్రమ వర్గాలు మరో రకంగాను చెబుతున్నాయి. అయితే తన పర్యటనను వాయిదా వేసుకోవడానికి కారణం ఏపీ పాలిటిక్స్‌లో వేగంగా సంబవిస్తున్న మార్పులేనని తెలుస్తోంది. బీజేపీతో జనసేన జతకట్టిన నేపథ్యంలో ఏపీ పొలిటికల్ పరిణామాలపై పార్టీలో చర్చించిన తర్వాతనే బాలకృష్ణ పర్యటించాలని భావించినట్లు చెబుతున్నారు.