AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మండలిని దుర్వినియోగం చేస్తున్న పాక్’.. భారత్ మండిపాటు

చైనా ద్వారా పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించి.. విఫలం కావడంపై భారత్ స్పందిస్తూ.. ఇలా మండలిని ఆ దేశం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. భవిష్యత్తులో ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా.. ఒక అంతర్జాతీయ వేదికను ఇరకాటంలో పెట్టకుండా చూడగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ‘ పాకిస్తాన్ కే కాదు.. మీకు కూడా హెచ్ఛరిక చేస్తున్నాం’ అని చైనాను ఉద్దేశించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. జమ్మూ […]

'మండలిని దుర్వినియోగం చేస్తున్న పాక్'.. భారత్ మండిపాటు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 5:21 PM

Share

చైనా ద్వారా పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించి.. విఫలం కావడంపై భారత్ స్పందిస్తూ.. ఇలా మండలిని ఆ దేశం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. భవిష్యత్తులో ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా.. ఒక అంతర్జాతీయ వేదికను ఇరకాటంలో పెట్టకుండా చూడగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ‘ పాకిస్తాన్ కే కాదు.. మీకు కూడా హెచ్ఛరిక చేస్తున్నాం’ అని చైనాను ఉద్దేశించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల ఏకాభిప్రాయాన్ని చైనాకూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. కాశ్మీర్ సమస్య భారత-పాకిస్తాన్ దేశాల ఆంతరంగిక సమస్య అని భద్రతా మండలిలో అన్ని దేశాలూ స్పష్టం చేశాయని, అందువల్లే మండలిలోని క్లోజ్డ్ రూంలో జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయాన్నీ వెలువరించలేదని ఆయన చెప్పారు. ‘అసలు పాక్-చైనా దేశాలు ఎందుకు తమకు తాము ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి ? ఇలాంటి చర్యలకు పాల్పడడంలో ఔచిత్యం లేదు ‘ అని రవీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

కాశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితిపై భద్రతా మండలి దృష్టి పెట్టాలని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి ఒక లేఖ రాశారని చైనా రాయబారి తెలిపారు. అయితే ఈ లేఖకు తాము పరోక్షంగా ఎందుకు మద్దతు తెలుపుతున్నామన్న విషయాన్ని ఆయన దాటవేశారు.

ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?
30ఏళ్లు పైబడిన మహిళలకు ఇది అమృతంతో సమానం..! బోలెడు ప్రయోజనాలు..
30ఏళ్లు పైబడిన మహిళలకు ఇది అమృతంతో సమానం..! బోలెడు ప్రయోజనాలు..
చలి మీ కళ్లను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?.. లైట్ తీసుకుంటే డేంజరే
చలి మీ కళ్లను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?.. లైట్ తీసుకుంటే డేంజరే
చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు
చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు
మంగళవారం హనుమంతుడి పూజతో శుభాలన్నీ మీవెంటే.. ఇలా చేయండి
మంగళవారం హనుమంతుడి పూజతో శుభాలన్నీ మీవెంటే.. ఇలా చేయండి
ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు