Paralysis Symptoms: వయసుతో పనిలేకుండా వస్తున్న పక్షవాతం.. లక్షణాలు.. ఆయుర్వేదంలో నివారణ చికిత్స

|

Aug 03, 2021 | 7:12 AM

Paralysis Symptoms: అప్పటివరకూ మనిషి ఆనందంగా తిరుగు గడుపుతుంటాడు. ఉన్నట్టుండి చెట్టంత మనిషి కుప్పకూలిపోతాడు. శరీరములోని వివిధ అవయవాలు చచ్చుబడి చలనం కోల్పోతాయి..

Paralysis Symptoms: వయసుతో పనిలేకుండా వస్తున్న పక్షవాతం.. లక్షణాలు.. ఆయుర్వేదంలో నివారణ చికిత్స
Paralysis
Follow us on

Paralysis Symptoms: అప్పటివరకూ మనిషి ఆనందంగా తిరుగు గడుపుతుంటాడు. ఉన్నట్టుండి చెట్టంత మనిషి కుప్పకూలిపోతాడు. శరీరములోని వివిధ అవయవాలు చచ్చుబడి చలనం కోల్పోతాయి. వెంటనే వైద్యం అందకపోతే శాశ్వతంగా వికలాంగుల్లా మారిపోవచ్చు .. ఒకొక్కసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. దీనినే పక్షవాతం అని అంటారు. ద్య పరిభాషలో బ్రెయిన్ స్ట్రోక్‌గా పిలిచే పెరాలసిస్ నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి బాధపడినవారి జీవితం హఠాత్తుగా అంధకారమవుతుంది. మన దేశంలో సగటున 10 శాతం మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు.

పక్షవాతం వచ్చినప్పుడు శరీరంలో ఏదైనా భాగం చచ్చుబడిపోతుంది. సర్వసాధారణంగా పక్షవాతంలో ఒక కాలు , ఒక చెయ్యి కాని లేదా రెండుకాళ్లు గాని చచ్చుబడిపోతాయి. ఈ వ్యాధి ఎక్కువగా రక్తపోటు అధికం అయినప్పుడు మెదడులోని నాడులు చచ్చుబడిపోయి మాటకూడా పడిపోతుంది. ఇది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేది. అయితే కాలక్రమంలో మనిషి జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులతో మానసిక ఒత్తిడి వలన నలభై సంవత్సరాల వారికి కూడా వస్తుంది. ఒకసారి పక్షవాతం వస్తే సరైన చికిత్స తీసుకుంటే మూడు నుంచి ఆరు నెలల సమయంలో రోగి కోలుకుని.. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు.

పక్షవాతం రావడానికి గల కారణాలు అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నాడి దౌర్బల్యము, నిద్రలేమి, అతి వ్యాయామం, బరువులు ఎత్తడం, అతిగా మాట్లాడడం, మద్యపానం, ధూమపానమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పక్షవాతం లక్షణాలు : తల తిరగటం, కాలు, చెయ్యి తిమ్మిర్లు, రక్తపోటు, మెడ నరములు లాగడం, నిద్రపట్టకపోవడం, నడవలేకపోవడం

నివారణ మార్గాలు :

* జాజికాయ నీటితో అరగదీసి చచ్చుబడిన అవయవానికి పట్టువేయాలి
* కసవింద చెట్టు రసంలో వెన్న కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయాలి
* వెల్లుల్లి , పసుపు కలిపి నూరి మర్దించవలెను
* నువ్వులనూనెతో మిరియాల చూర్ణం కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేస్తే.. క్రమంగా పక్షవాతం తగ్గుతుంది.

Also Read: GHMC Campaign: దోమలకి నివారణకు మస్కిటో హంటింగ్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు..