అయోధ్య ఈవెంట్, స్టేజీపై ప్రధానితో బాటు మరో నలుగురికే స్థానం !

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి  ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి.  కాషాయ రంగులో ముద్రించిన ఇన్విటేషన్ కార్డును నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు. వేదికపై ప్రధాని మోదీతో..

అయోధ్య ఈవెంట్, స్టేజీపై ప్రధానితో బాటు మరో నలుగురికే స్థానం !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 5:39 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి  ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి.  కాషాయ రంగులో ముద్రించిన ఇన్విటేషన్ కార్డును నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు. వేదికపై ప్రధాని మోదీతో బాటు మరో నలుగురికి మాత్రమే చోటు ఉంటుంది. మోదీతో సహా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాల్ దాస్ మాత్రమే ఆసీనులవుతారు.

ఈ ఇన్విటేషన్ కార్డుపై’రామ్ లాలా’ ఇమేజీని అందంగా రూపొందించారు. ప్రతి ఆహ్వాన పత్రికకు సెక్యూరిటీ కోడ్ ఉందని, దీన్ని ఒక్కసారి మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. భూమి పూజ జరిగే స్థలం నుంచి ఒకసారి బయటకు వెళ్తే తిరిగి అనుమతించబోమన్నారు. మొత్తం 175 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయోధ్య కేసులో ముస్లిం లిటిగెంట్ అయిన ఇక్బాల్ అన్సారీకి మొదటి ఇన్విటేషన్ కార్డును పంపినట్టు నిర్వాహకులు వెల్లడించారు.