ధోని తన చివరి మ్యాచ్ ఆడేశాడు..

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్‌మెంట్‌ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. సీనియర్ ఆటగాళ్ల నుంచి యువ క్రికెటర్లు వరకు అందరూ కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు.

ధోని తన చివరి మ్యాచ్ ఆడేశాడు..

Dhoni Completed His Last Match: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్‌మెంట్‌ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. సీనియర్ ఆటగాళ్ల నుంచి యువ క్రికెటర్లు వరకు అందరూ కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఐపీఎల్‌తో ధోని భవితవ్యం ముడిపడి ఉందని.. ఆ టోర్నీలో ఫెయిల్ అయితే అతడి కెరీర్ ముగుస్తుందని కొంతమంది అంటున్నారు. ఇక తాజాగా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ధోని కెరీర్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

”ధోని తన చివరి మ్యాచ్ సంతోషంగా ఆడేశాడని.. ఐపీఎల్‌తో ధోని కెరీర్‌ ముడిపడిలేదని చెప్పుకొచ్చాడు. ధోని కొత్తగా నిరుపించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. రిటర్మెంట్‌కు సంబంధించి త్వరలోనే ధోని ఒక నిర్ణయం తీసుకుంటాడని, అతడే స్వయంగా ప్రకటిస్తాడని నెహ్రా తెలిపాడు. ఒకవేళ ధోని మళ్ళీ ఆడడానికి సిద్దంగా ఉంటే తాను సంతోషిస్తానని వివరించాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu