హ్యాపీ బర్త్‌డే ‘మిస్టర్ కూల్’: ‘ధోని’ పేరు ఓ సంచలనం.. కెప్టెన్లకు అతడే ఆదర్శం..

మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం.. 2004లో భారత్ జట్టులోకి వచ్చిన ఈ ఝార్ఖండ్ డైనమేట్.. వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

హ్యాపీ బర్త్‌డే 'మిస్టర్ కూల్': 'ధోని' పేరు ఓ సంచలనం.. కెప్టెన్లకు అతడే ఆదర్శం..
Follow us

|

Updated on: Jul 07, 2020 | 3:08 PM

మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం.. 2004లో భారత్ జట్టులోకి వచ్చిన ఈ ఝార్ఖండ్ డైనమేట్.. సౌరవ్ గంగూలీ తర్వాత సారధ్య బాధ్యతలను తీసుకుని వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

మ్యాచ్ పరిస్థితి ఏదైనా కూడా.. ధోని క్రేజ్‌లో ఉన్నాడంటే విజయం భారత్ వైపే ఉంటుందని అభిమానుల నమ్మకం. అంతేకాక మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉన్నా.. వికెట్ల వెనుక కూల్‌గా నిర్ణయాలు తీసుకోవడంలో ధోని మించినోడు లేదని చెప్పాలి. అటు డీఆర్ఎస్ సిస్టంకు కూడా సరికొత్త పేరు పెట్టింది ధోనినే. కొన్నిసార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పు కావచ్చు. కానీ ధోని ఎప్పుడూ పర్ఫెక్ట్. బ్యాటింగ్‌లో తన దూకుడును ప్రదర్శిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

1983 తర్వాత ఇండియాకు వన్డే ప్రపంచకప్ సాధించడమే కాకుండా.. 2007లో టీ20 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ధోని కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు వెన్నంటే ఉండి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి అటు అభిమానులు, ఇటు క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా, ఐసీసీ ధోని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..