అయోధ్యకు చేరుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలో బుధవారం జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలను పర్యవేక్షించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. అటు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో..

అయోధ్యకు చేరుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలో బుధవారం జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలను పర్యవేక్షించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. అటు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను కూడా యోగి పరిశీలించారు. భూమి పూజ సందర్భంగా భక్తులందరూ తమ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఆయన మరోసారి  కోరారు.అవధ్ పురిలో రామాలయ నిర్మాణానికి తమ జీవితాలను ధారపోసిన ఇద్దరు మహంత్ లను ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. ఇలా ఉండగా సోమవారం ఉదయం అయోధ్యలో గౌరీ గణేశ పూజతో వేదోక్త మంత్రాలను 11 మంది పురోహితులు పఠించారు. కాశీ, కంచి, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా ఆయా ఆలయాల్లో ఈ విధమైన పూజలు జరిగాయి.

మరోవైపు …కరోనా వైరస్ భయాలున్నప్పటికీ పెద్ద సంఖ్యలో మహంత్ లు, సాధువులు, రామ భక్తులు అయోధ్య చేరుకోవడం ప్రారంభించారు.మరి భూమి పూజ రోజు నాటికి ఇలాంటి వారి సంఖ్య మరింత పెరగవచ్చు.. పెద్ద సంఖ్యలో వస్తున్న వీరిని ఎలా నియంత్రిస్తారన్నది ప్రశ్నగా మారింది.

 

Click on your DTH Provider to Add TV9 Telugu