క్రేజీ కాంబోః అన్నగా విష్ణు, చెల్లిగా కాజల్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు, స్టార్ హీరోయిన్ కాజల్ ఇద్దరూ కలిసి మోసగాళ్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా నటించడం లేదు. అన్నాచెల్లెలిగా కనిపించబోతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వీరిద్దరికీ..
టాలీవుడ్ హీరో మంచు విష్ణు, స్టార్ హీరోయిన్ కాజల్ ఇద్దరూ కలిసి మోసగాళ్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా నటించడం లేదు. అన్నాచెల్లెలిగా కనిపించబోతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వీరిద్దరికీ సంబంధించిన లుక్స్ రిలీజ్ చేసింది చిత్ర యనిట్. ఈ సినిమాని హాలీవుడ్ దర్మకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తుండగా.. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మోసగాళ్లు చిత్రం యూనివర్సల్ స్టోరీతో వస్తున్నట్లు తెలిపాడు. అయితే హాలీవుడ్‌లో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, అయినా కూడా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. కాగా ఈ మూవీ నాకు సూపర్ హిట్‌ను అందిస్తోందని విష్ణు చెప్పుకొచ్చారు. అయితే గత కొంత కాలంగా విష్ణుకు సరైన హిట్ లేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో వస్తున్నట్లు తెలుస్తోంది.
Read More:
రాఖీ పండుగః మహిళల కోసం సీఎం జగన్ ప్రత్యేక కానుక