దెయ్యంగా ‘చిన్నారి పెళ్లికూతురు’.. ఈసారి కొత్త యాంగిల్ ఏంటో.?
‘చిన్నారి పెళ్లికూతురు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నటి అవికా గోర్. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన ఈమె.. ‘సినిమా చూపిస్త మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. ఇది ఇలా ఉండగా ఎవరూ ఊహించిన రీతిలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అయితే తాజాగా ‘రాజు గారి గది 3’ సినిమాతో మళ్ళీ అదిరిపోయే రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న రాజుగారి గది సిరీస్‌లో […]
‘చిన్నారి పెళ్లికూతురు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నటి అవికా గోర్. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన ఈమె.. ‘సినిమా చూపిస్త మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. ఇది ఇలా ఉండగా ఎవరూ ఊహించిన రీతిలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంది.
అయితే తాజాగా ‘రాజు గారి గది 3’ సినిమాతో మళ్ళీ అదిరిపోయే రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న రాజుగారి గది సిరీస్‌లో మూడవ చిత్రంగా ‘రాజుగారి గది3’ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ పోస్టర్‌లో అవికా లుక్ భయంకరంగా ఉంది. అన్ని హారర్ సినిమాల మాదిరిగానే ఈ పోస్టర్ బట్టి చూస్తుంటే దెయ్యం.. ఇంకా మాంత్రికుడు ఫార్ములాగ అనిపిస్తోంది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది.
Director @VVVinayakOnline launched the fiercy first look of #RajuGariGadhi3
Starring #AvikaGor and #AshwinBabu
A film by #Ohmkar#RGG3 Releasing this Dussehra pic.twitter.com/3f7th63x72
— BARaju (@baraju_SuperHit) September 2, 2019