తెలంగాణలో ఎరువుల దుకాణాలపై అధికారుల దాడులు
తెలంగాణలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి
తెలంగాణలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఏకకాలంలో దాడులు చేేపట్టారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల ఈ దాడులు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో కొనసాగుతున్నాయి.
దుకాణాలలో రికార్డులను వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా కేంద్రంలో అధికారుల దాడులతో కొన్ని ఎరువుల దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. రికార్డుల తనిఖీలో అవకతవకలతో జిల్లా కేంద్రంలోని ఒక ఎరువుల దుకాణం హోల్ సేల్ లైసెన్స్ ను అధికారులు రద్దు చేశారు. దీంతో నగరంలోని కొన్ని దుకాణాలు మూసివుంచారు.