చంద్రబాబు రాజధాని పర్యటన.. నల్ల జెండాలతో రైతులు నిరసన!

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నాడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు.. అయితే ఈలోపే ఆయనకు రాజధాని రైతుల నుంచి అటు అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అమరావతిలోని ఓ వర్గం రైతులు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని పేరుతో అసైన్డ్ భూముల రైతులకు అన్యాయం చేసిందని వాపోయారు. పట్టా భూములకు ఒక ప్యాకేజ్, అసైన్డ్ రైతులకు ఒక ప్యాకేజ్ ఇచ్చారని.. దళితులను చిన్న చూపు చూశారన్నారు. తమకు అన్యాయం చేసిన చంద్రబాబును […]

చంద్రబాబు రాజధాని పర్యటన.. నల్ల జెండాలతో రైతులు నిరసన!
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 27, 2019 | 9:23 PM

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నాడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు.. అయితే ఈలోపే ఆయనకు రాజధాని రైతుల నుంచి అటు అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అమరావతిలోని ఓ వర్గం రైతులు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని పేరుతో అసైన్డ్ భూముల రైతులకు అన్యాయం చేసిందని వాపోయారు. పట్టా భూములకు ఒక ప్యాకేజ్, అసైన్డ్ రైతులకు ఒక ప్యాకేజ్ ఇచ్చారని.. దళితులను చిన్న చూపు చూశారన్నారు. తమకు అన్యాయం చేసిన చంద్రబాబును రాజధానిలో పర్యటించకుండా అడ్డుకుంటామని అన్నారు. దళిత రైతులకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రాయపూడిలో దళిత రైతులు నల్ల జెండాలు ఎగరేస్తూ నిరసన తెలియజేశారు.

అటు వైఎస్సార్ సీపీ నేతల కూడా చంద్రబాబు పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని పేరుతో బ్లూ ప్రింట్లు, గ్రాఫిక్స్ చూపించి రైతులను మభ్యపెట్టి.. ఇప్పుడు మళ్ళీ పర్యటన ఎలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ ఖాళీ అయింది కాబట్టే.. దాని మనుగడ కోసం ఇప్పుడు రాజధానిలో పర్యటిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు.