AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం సాహసం..మంచుకొండల్లో ఏం చేశాడంటే?

తమ తమ రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రయత్నాలు చేస్తూనే వుంటాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత చంద్రబాబు, ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు పర్యటక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రతీ ఒక్కరికి తెలిసిందే. కానీ ఇపుడు ఓ ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు.. యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించేందుకు చేస్తున్న కృషి, తీసుకుంటున్న రిస్క్ మాత్రం అంతా ఇంతా కాదు. అరుణాచల్‌ప్రదేశ్ […]

సీఎం సాహసం..మంచుకొండల్లో ఏం చేశాడంటే?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 28, 2019 | 9:31 PM

Share

తమ తమ రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రయత్నాలు చేస్తూనే వుంటాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత చంద్రబాబు, ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు పర్యటక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రతీ ఒక్కరికి తెలిసిందే. కానీ ఇపుడు ఓ ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు.. యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించేందుకు చేస్తున్న కృషి, తీసుకుంటున్న రిస్క్ మాత్రం అంతా ఇంతా కాదు.

అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో టూరిజంను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సీఎం పెమా ఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఘాట్ రోడ్డులో బైక్ మీద ఒంటరిగా 122 కి.మీ.లు ప్రయాణం చేసిన పెమా ఖండూ.. తాజాగా మరో పీట్‌లో సంచలనం సృష్టించారు. 15 వేల 600 అడుగుల ఎత్తులో, మంచుకొండల్లో 107 కి.మీ.లు స్వయంగా ఆల్ టెరైన్ వాహనాన్ని నడిపారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ రైడ్‌లో పాల్గొనడం విశేషం.

ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో చైనా బోర్డర్‌కు అత్యంత దగ్గరగా వుండే తవాంగ్ జిల్లాలో పీటీఎస్వో లేక్ నుంచి మాంగో ఏరియా వరకు ఏటీవీని 107 కిలోమీటర్ల దూరం సీఎం పెమా ఖండూ నడుపుకుంటూ వెళ్ళారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాహసోపేతమైన ఈ రైడ్ తర్వాత సరిహద్దులోని జవాన్లతో పెమా ఖండూ, కిరణ్ రిజిజు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ యాత్రలో పెమా ఖండూతోపాటు పాల్గొన్న కేంద్ర మంత్రి రిజిజు అయితే.. ఖండూ సాహసాన్ని సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. అత్యంత కఠినమైన రైడ్‌ను పెమా ఖండూ అత్యంత వేగంగా, ఉత్సాహంగా నడిపారు. ఆయన పక్కన తాను నమ్మకంగా కూర్చున్నానని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!