సరిహద్దుల్లో టెన్షన్..టెన్షన్…పొంచిఉన్న 300 మంది ఉగ్రవాదులు..!
జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 300 మంది ఉగ్రవాదులు పీఓకే నియంత్రణ రేఖ వెంబడి కాపుగాసి ఉన్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందింది. అక్కడి నుంచి కశ్మీర్ లోయలోకి ప్రవేశించాలన్నది వారి కుట్రగా తెలుస్తోంది. రంజాన్ వేళ ఇండియాలోకి చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ముష్కరులు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో వెంటనే […]

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 300 మంది ఉగ్రవాదులు పీఓకే నియంత్రణ రేఖ వెంబడి కాపుగాసి ఉన్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందింది. అక్కడి నుంచి కశ్మీర్ లోయలోకి ప్రవేశించాలన్నది వారి కుట్రగా తెలుస్తోంది. రంజాన్ వేళ ఇండియాలోకి చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ముష్కరులు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం..సరిహద్దుల వెంబడి సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తోంది.
కశ్మీర్లోని XV కార్ప్స్ ని లీడ్ చేస్తోన్న లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు.. చొరబాట్లకు అవకాశమున్న అన్ని ఏరియాస్ ని తనిఖీలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. తరచుగా వివిధ టీమ్స్ తో రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఈ ఆపరేషన్లో కాల్పులు జరపాల్సి వస్తే ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశంపై కొన్ని సూచనలు చేశారు అధికారులు. ప్రత్యర్థులకు కరోనా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మీకి సూచించారు.




