ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి మరోసారి ఏపీఎస్‌ఆర్టీసీ షాక్‌..

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు షాక్ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ ముగిసిందని...నేటి నుంచి విధులకు రావొద్దంటూ

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి మరోసారి ఏపీఎస్‌ఆర్టీసీ షాక్‌..
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 11:17 AM

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు షాక్ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ ముగిసిందని…నేటి నుంచి విధులకు రావొద్దంటూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయి. గత నెలలోనే వాళ్ళను తొలగించి విమర్శలు రావడంతో వెనక్కితగ్గిన ఏపీఎస్‌ఆర్టీసీ మళ్ళీ అదే నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగులను తొలగించబోమని గతంలో చెప్పిన మంత్రి పేర్ని నాని మాటకు విలువ లేకుండా పోయిందని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వాపోయారు. ఈ నిర్ణయంతో దాదాపు 7800 మంది ఔటర్‌సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

Also Read: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం