AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకాభిప్రాయానికి కట్టుబడివుందాం.. భారత్-చైనా అంగీకారం

భారత-చైనా మధ్య ఉద్రిక్తతకు చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యపై విభేదాల పరిష్కారానికి ఉభయ దేశాల నాయకులూ ఏకాభిప్రాయానికి వచ్చారని, దీనికి కట్టుబడి ఉండాలని, బోర్డర్ ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని వారు..

ఏకాభిప్రాయానికి కట్టుబడివుందాం.. భారత్-చైనా అంగీకారం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 11:27 AM

Share

భారత-చైనా మధ్య ఉద్రిక్తతకు చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యపై విభేదాల పరిష్కారానికి ఉభయ దేశాల నాయకులూ ఏకాభిప్రాయానికి వచ్చారని, దీనికి కట్టుబడి ఉండాలని, బోర్డర్ ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని వారు నిర్ణయించినట్టు సీనియర్ దౌత్యాధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన వీరు.. లడాఖ్ తూర్పు ప్రాంతంలో నియంత్రణ రేఖ పొడవునా ఉద్రిక్తతలు చల్లారడానికి మార్గాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చైనా విదేశాంగ శాఖలో డిపార్ట్ మెంట్ ఆఫ్ బౌండరీ అండ్ ఓషనిక్ అఫైర్స్ శాఖ లోని డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్, భారత విదేశాంగ శాఖలోని సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాత్సవ మధ్య చర్చలు జరిగాయి. భారత-చైనా సరిహద్దు సమస్యపై కూలంకషంగా వీరు చర్చించారని, ఈ నెల 17 న ఉభయ దేశాల విదేశాంగ మంత్రులూ ఫోన్ ద్వారా జరిపిన సంప్రదింపుల్లో వఛ్చిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని వీరు  తీర్మానించారు. ఈ నెల 6, 22 తేదీల్లో రెండు దేశాల మధ్య సైనిక స్థాయిలో జరిగిన చర్చల ఫలితాలను కూడా వీరు విశ్లేషించారు.

ప్రస్తుతం లడాఖ్ తూర్పు ప్రాంతంలో పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉంది. నిన్నటికి నిన్న విడుదలైన  శాటిలైట్ ఇమేజీలను  చూస్తే గాల్వన్ వ్యాలీలో చైనా దళాల ఉనికి, వారి ఆర్టిల్లరీ శకటాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Follow Us
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే
పాములా వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!
పాములా వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!