
APPSC Alert: ఏపీపీఎస్సీ మరో గుడ్ న్యూస్ అందించింది. శాఖాపరమైన పరీక్షలకు అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తులు ఆహ్వానించినా పరీక్షలు జరగకపోవడంతో.. గత నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసి దరఖాస్తు చేసేందుకు మరోసారి అవకాశం కల్పించనుంది. ఈ మేరకు కమిషన్ సెక్రెటరీ ఓ ప్రకటనను విడుదల చేశారు. గతంలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల నుంచి అభ్యర్ధనలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సమీప పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఏయే పేపర్లను ఎంచుకున్నారో వాటిని మాత్రమే రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఎగ్జామ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
Also Read:
నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా.!
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించే కీలకాంశాలు ఇవే..